పాముకాటుకు గురై బాలుడు మృతి
దౌల్తాబాద్: మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని చిన్నమాసానపల్లి గ్రామంలో బాలుడు పాముకాటుకు గురై మృతిచెందాడు. గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అబ్బి(5)ని పాము కాటు వేసిందని, శుక్రవారం తెల్లవారు జాముకి బాలుడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.