టీ ట్వంటీల్లో భారత్‌కు మూడో ర్యాంక్
దుబాయ్
జూలై 25 :ఐసిసి ట్వంటీ ట్వంటీ ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానం నిలబెట్టుకుంది. తాజాగా విడుదలైన జాబితాలో టీమిండియా 121 పాయింట్లతో కొనసాగుతోంది. వరల్డ్‌కప్ రన్నరప్ శ్రీలంక అగ్రస్థానంలో ఉండగా…వెస్టిండీస్ రెండో స్థానంలో నిలిచింది. లంక ఖాతాలో 134 , విండీస్ ఖాతాలో 127 పాయింట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఐసిసి బోర్డ్ విూటింగ్‌లో ఇకపై టీ ట్వంటీ ర్యాంకింగ్స్ పిరీయడ్‌ను మూడేళ్ళ నుండి నాలుగేళ్ళకు పెంచారు. ఇదిలా ఉంటే విండీస్-పాక్ మధ్య జరిగే రెండు టీ ట్వంటీలతో మళ్ళీ ర్యాంకింగ్స్‌లో మార్పులు జరిగే అవకాశముంది. ఈ సిరీస్‌లో పాకిస్థాన్ రెండు మ్యాచ్‌లూ గెలిస్తే రెండో స్థానం చేజిక్కించుకుంటుంది. ప్రస్తుతం పాక్ జట్టు 118 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. రెండు టీ ట్వంటీల్లోనూ విండీస్ ఓడితే 120 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోతుంది. ఒకవేళ వెస్టిండీస్ రెండు మ్యాచ్‌లూ గెలిస్తే ఐదు రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకుని అగ్రస్థానానికి మరింత చేరవవుతుంది.