ప్రమాదవశాత్తూ వ్యాను బోల్తా: ఒకరి మృతి

హైదరాబాద్‌, అల్వాల్‌: బొల్లారం వద్ద రాజీవ్‌ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. మెదక్‌ జిల్లా దౌలతాబాద్‌ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బాలిరెడ్డి తన కూతురు కీర్తన నగరంలో గుండెజబ్బుతో మృతి చెందడంతో మృతదేహాన్ని గ్రామానికి తరలిస్తుండగా బొల్లారం వద్ద వ్యాను అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బాలిరెడ్డి భార్య మంజుల (33) మృతి చెందారు. బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రులు గాంధీ ఆసుపత్రిలో, స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.