వార్ రూమ్‌లో కొనసాగుతున్న వరుస భేటీలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ వార్‌రూమ్‌లో రాష్ట్ర రాజకీయాలు, తెలంగాణ అంశంపై చర్చలు జరుగుతున్నారు. ఈ అంశాలపై చర్చించేందుకు రాష్ట్రానికి చెందిన త్రిమూర్తులతో దిగ్విజయ్‌సింగ్, గులాం నబీ ఆజాద్ వరుస భేటీలు జరుపుతున్నారు. సీఎంతో భేటీ ముగిసిన అనంతరం పీసీసీ చీఫ్ బొత్ససత్యనారాయణతో వారు చర్చిస్తున్నారు. సుమారు 45 నిమిషాల పాటు సీఎంతో చర్చలు జరిపారు. బొత్సతో భేటీ ముగిసిన అనంతరం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వార్‌రూమ్‌లోకి ప్రవేశించనున్నారు.