66వ వార్షిక మహా సభలో తీర్మాణాల ఆమోదించాలని విజ్ఞప్తి
భీమదేవరపల్లి మండలం సెప్టెంబర్ (27)జనంసాక్షి న్యూస్
66 వార్షిక మహాసభలో పలు తీర్మానాలు ఆమోదించాలని సంఘ రైతు లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి కోరారు. సోమవారం మండలంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ములుకనూరు సహకార గ్రామీణ పరపతి , మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ పాలకవర్గం ,అధ్యక్షులు ఈ 66వ వార్షిక మహా సభలో పలు తీర్మాణాలు ఆమోదించాలని కోరారు.వాటిలో ప్రతి అర్హత గల సంఘ సభ్యుడు ప్రతిసారి జరిగే ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుటకు వీలుగా తీర్మాణం సవరించి ఈ 66వ వార్షిక మహాసభలో ఆమోదింపచేయాలి,గ్రామాలవారిగా నియోజకవర్గ పాలకవర్గ సభ్యుని ఎన్నుకునే విధానాన్ని తీసుకువచ్చి తీర్మాణాలు
సవరించి ఈ 66వ వార్షిక మహాసభలో ఆమోదింపచేయాలి. వార్షిక మహాసభను ఏప్రిల్, మే, జూన్ నెలలలో జరుపుటకు తీర్మాణ ఆమోదింపచేయాలి.తీర్మాణాలను ఈ 66వ వార్షిక మహాసభలో ఆమోదింపచేసి రిజిస్ట్రార్ కి పంపించాల్సిందిగా మనవి చేశారు. ఈ కార్యక్రమంలో ఏనుగు సురేందర్ రెడ్డి ,మీసమహేష్,మాసశంకరయ్య ,మార్పుకృష్ణారెడ్డి ,రావుల తిరుపతి ,మేక వెంకన్న తదితరులు పాల్గొన్నారు.