వెనకడుగు వేసే ప్రసక్తే లేదు

ఐదారు నెలల్లో తెలంగాణ

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 1 (జనంసాక్షి) :

తెలంగాణ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని కేంద్ర ¬ంమంత్రి సుశీల్‌కు మార్‌షిండే స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటు రాజ్యాంగబద్దంగా పూర్తవుతుందని అన్నారు. ¬ంత్రిగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు తూ తెలంగాణ విషయంలో ఎలాంటి అను మానాలకు తావు లేదన్నారు. అలాగే ఆర్నెల్లలోపు తెలంగాణ పక్రియ పూర్తవుతుం దని కూడా షిండే స్పష్టం చేశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాకపోవచ్చని, వచ్చే శీతాకాల సమావేశాల్లో బిల్లు పాసవుతుందని అన్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. సీమాంధ్రుల డిమాండ్‌పై పార్టీ స్పందిస్తుం దని కూడా వివరించారు. తెలంగాణపై సీడబ్ల్యూసీ తీర్మానం చేసి కేంద్రానికి అందజేసిందని షిండే తెలిపారు. సీడబ్ల్యూసీ తీర్మానం చెప్పినట్లు పదేళ్లు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ఆయన తెలిపారు. రాజ్యాంగం ప్రకారం తదుపరి పక్రియ కొనసాగుతుందని, ఆరు నెలల్లోపు తెలంగాణ పక్రియ పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. విదర్భనే కాకుండా చాలా చోట్ల నుంచి విభజన డిమాండ్లు వస్తున్నాయని, చాలా ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నందువల్లనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ డిమాండ్‌కు ఇతర రాష్ట్రాల డిమాండ్‌కు సంబంధం లేదన్నారు. తెలంగాణ 1956లో విలీనం చేసినప్పటి నుంచి ఉందన్నారు. దీనిని ఇతర డిమాండ్లతో ముడిపెట్టడం సరికాదన్నారు. ఈ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాకపోవచ్చునని షిండే పేర్కొన్నారు. తమ ముందుకొచ్చే అన్ని ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలిస్తామ న్నారు. కొత్తరాష్ట్రాల కోసం పోరాడేవారి డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తుం దన్నారు. అయితే కొత్త రాష్ట్రాల కోసం ఆందోళన చేసేవారు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలని సూచించారు. విదర్భ కంటే ముందునుంచే తెలంగాణ డిమాండ్‌ ఉందని షిండే గుర్తుచేశారు. చిన్న రాష్ట్రాల వల్ల నక్సలిజం పెరుగుతుందన్న అభిప్రాయం తమకు లేదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో 4, ఈశాన్య రాష్ట్రాల్లో 5, 6 చోట్ల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లున్నాయని షిండే తెలిపారు. సీమాంధ్రలో ఆందోళనలు తమ దృష్టికి వచ్చాయని, విభజన నిర్ణయం వెనక్కి తీసుకోవాలన్న సీమాంధ్రుల డిమాండ్‌పై పార్టీ స్పందిస్తుందని షిండే తెలిపారు. అయితే తెలంగాణపై నిర్ణయం జరిగినందున వెనక్కి పోలేమన్నారు. దీనిపై విస్తృతంగా చర్చించామని కూడా చెప్పారు. డిసెంబర్‌లో అఖిలపక్ష సమావేవంలో అందరి సూచనలు తీసుకున్నామని గుర్తు చేశారు. ఏకపక్షంగా నిర్ణయం తీకున్నామన్న వాదన సరికాదన్నారు. తెలంగాణపై అసెంబ్లీ తీర్మానమెలా ఉన్నా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేసి తీరుతామన్నారు. సీమాంధ్రకు కొత్త రాజధాని నిర్మితమయ్యే వరకే హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు.