యుఎఇ నేదికగా లంకతో పాక్ సిరీస్
లా¬ర్,ఆగష్ట్ 2 (ఆర్‌ఎన్‌ఎ):
శ్రీలంకతో జరగనున్న వన్డే , టెస్ట్ సిరీస్ షెడ్యూల్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. డిసెంబర్ , జనవరిలో నెలల్లో యుఎఇ వేదికగా రెండు జట్లూ తలపడనున్నాయి.ఈ టూర్‌లో శ్రీలంక జట్టు మూడు టెస్టులు , ఐదు వన్డేలతో పాటు రెండు టీ ట్వంటీలు ఆడనుంది. దుబాయ్ , షార్జా , అబుదాబీలలో మ్యాచ్‌లు జరగ నున్నాయి. డిసెంబర్ 11న జరిగే టీ ట్వంటీతో పర్యటన మొదలుకానుంది. రెండో టీ ట్వంటీ 13న జరగనుండగా…డిసెంబర్ 18 నుండి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. తర్వాత డిసెంబర్ 31 నుండి మూడు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది. 2009లో లంక జట్టుపై ఉగ్రవాదుల దాడి జరిగినప్పటి నుండీ ఏ జట్టూ కూడా పాక్‌లో పర్యటించడం లేదు. దీంతో యుఎఇని తటస్థ వేదికగా చేసుకుని ఆ జట్టు సిరీస్‌లు ఆడుతోంది.