ఉరకలేస్తూ.. పరుగులేస్తూ! తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం

న్యూఢిల్లీ, ఆగస్టు 5 (జనంసాక్షి) :తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను యూపీఏ ప్రభుత్వం ఉరుకులు.. పరుగుల మీద కొనసాగిస్తోంది. ఆడిన మాటకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం సోమ వారం రాజ్యసభలో తెలంగాణపై రాజ్యాంగ పక్రియ ప్రారం భమైనట్లు ప్రకటించారు. హోం మంత్రి సుశీల్‌కుమార్‌షిండే అనారోగ్యంతో ముంబయిలోని బ్రీచ్‌క్యాండీ ఆస్పత్రిలో చేరగా, కేంద్ర ప్రభుత్వం తరఫున చిదంబరం ప్రకటన చేశా రు. తెలంగాణపై కేబినెట్‌ నోట్‌ సిద్ధమైందని తెలిపారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించి రాజ్యాంగంలో స్పష్ట మైన విధివిధానాలు ఉన్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నా రు. కొత్త రాష్ట్ర ఏర్పాటుకు ముందు అనేక అంశాలను పరిశీలించాల్సి ఉందని, ఆ అంశాలనన్నింటిని ప్రభుత్వం పరిశీలిస్తోందని చిదంబరం తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ¬ంశాఖ నోట్‌ను కేబినెట్‌ ముందుకు తీసుకువస్తుం దని చెప్పారు. విభజన సందర్భంగా అన్ని అంశాలను చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. రాజ్యాంగబ ద్ధంగానే తెలంగాణ ఏర్పాటు జరుగుతుందని అన్నారు. నదీ జలాలు, విద్యుత్‌, సీమాంధ్రుల భద్రతపై చర్చిస్తామని, ప్రాథమిక హక్కులు కాపాడే బాధ్యత కేంద్రానిదే అన్నారు. ఎవరు కూడా ఆందోళనచెందాల్సిన అవసరం లేదని అందరి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇదిలాఉంటే ఆగస్టు 8న జరిగే కేబినెట్‌ సమావేశంలో నోట్‌ పైన చర్చ జరిగే అవకాశముంది. కాగా సోమవారం ఉదయం పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాక ఉభయ సభలను విభజన అంశం కుదిపేసింది. దీంతో లోకసభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌ సభలను రెండుసార్లు వాయిదా వేశారు. మూడోసారి కూడా సీమాంధ్ర పార్లమెంటు సభ్యు లు ఆందోళన చేయడంతో ఇరు సభలను మంగళవారానికి వాయిదా వేశారు. లోకసభలో ఎంపీలు లగడపాటి రాజగో పాల్‌, ఎస్పీవై రెడ్డి, కనుమూరి బాపిరాజు, హర్షకుమార్‌ తదితరులు ఆందోళన చేపట్టారు. వారు పోడియం వైపుకు దూసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సైగ చేయడంతో అందులో కొందరు వెనక్కి తగ్గారు. రాజ్యసభలోను సీమాంధ్ర ఎంపీలు నిరసన తెలిపారు. ఓ దశలో డెప్యూటీ చైర్మన్‌ కురియన్‌ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాఖండ్‌లాగా తెలంగాణ అంశం కూడా ముఖ్యమైనదేనని వ్యాఖ్యానించారు. లోక్‌సభ సమావేశం మూడు గంటలకు తిరిగి ప్రారంభమైంది. సీమాంధ్ర ప్రాంత ఎంపీల నినాదాలు కొనసాగుతుండగానే ఎంపీ షెల్జా రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు నేపథ్యంలో కాసేపు మాట్లాడారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాలు రక్షించాలం టూ టీడీపీ సభ్యులు, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన చేపట్టారు. మూడుసార్లు వాయిదా తర్వాత కూడా ఆందోళన సద్దుమణగకపోగా నినాదాల ¬రు తీవ్రం కావడంతో సభను సభాపతి రేపటికి వాయిదా వేశారు. సీమాంధ్ర ప్రాంత ప్రయోజ నాలు రక్షించాలంటూ తెదేపా సభ్యులు, సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర కాంగ్రెస్‌ ఎంపీలు రాజ్యసభలోనూ ఆందోళన చేపట్టారు. దాంతో సమావేశాన్ని రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కేబినెట్‌ నోట్‌ సిద్ధం చేస్తున్నామని కేంద్రం రాజ్యసభకు తెలిపింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పక్రియ విధివిధానాలపై కేబినెట్‌ నోట్‌ రూపొందుతోందని తెలిపింది. కేందప్రభుత్వం ఆంధప్రదేశ్‌ విభజన అంశాన్ని సక్రమంగా నిర్వహించలేకపోతోందని బీజేపీ సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ఆరోపించారు. సభలో సమాధానం చెప్పలేకే ప్రభుత్వం నోట్‌ను పంపిణీ చేసిందని పేర్కొన్నారు. ఉభయ సభలు వాయిదా పడిన అనంతరం సీమాంధ్ర కేంద్రమంత్రులు భేటీ అయ్యారు. భేటీకి కిశోర్‌ చంద్రదేవ్‌ హాజరు కాలేదు. అయితే వారి సమావేశానికి మద్దతిస్తానని ఆయన చెప్పారు. మరోవైపు కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి రాయల తెలంగాణ కోసం లాబీయింగ్‌ చేస్తున్నారని సమాచారం వచ్చింది. సోనియా గాంధీతో ఆయన కర్నూలు ఎమ్మెల్యేల అపాయింటుమెంటును ఫిక్స్‌ చేశారని తెలుస్తోంది. రేపు ఆ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అధినేత్రిని కలువనున్నారు. రాయల తెలంగాణ కోసం వారు అధినేత్రికి విజ్ఞప్తి చేయనున్నారని సమాచారం. విభజన జరిగితే కర్నూలును హైదరాబాదులో కలపాలని కోట్ల చెబుతున్నారు. ఇందు కోసమే ఎమ్మెల్యేలకు సోనియా అపాయింటుమెంట్‌ ఇప్పించినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రుల అభిప్రాయ సేకరణకు ఉన్నతస్థాయి ద్విసభ్య కమిటీ ఏర్పాటయిందని, దానికి తమ అభిప్రాయాలు చెబుతామని కేంద్రమంత్రి జెడి శీలం అన్నారు. ఈ కమిటీలో దిగ్విజయ్‌ సింగ్‌, ఏకే ఆంటోనీ ఉన్నారు. వారికి సీమాంధ్రులు తమ వాదన వినిపించుకోవచ్చు. అంతకుముందు సీమాంధ్ర కేంద్రమంత్రులతో ఏకే ఆంటోని సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని అన్నివర్గాల మనోభావాలను ముందుగా ప్రధాని, దిగ్విజయ్‌లకు తెలియజేస్తామన్నారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోని, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్‌లతో ఈ కమిటీని ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను ద్విసభ్యకమిటీ దృష్టికి తీసుకెళతామని ఆయన చెప్పారు. రాజీనామాలతో సమస్య పరిష్కారం కాదని ఆయన పేర్కొన్నారు.