తెలంగాణపై వెనక్కి తగ్గం: సోనియాగాంధీ
న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ ఏర్పాటు నిర్ణయంపై వెనక్కి తగ్గేదిలేదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెగేసి చెప్పారు. ఇవాళ ఆమెను కలిసిన సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ విషయం తెలిపారు. తెలంగాణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని, సీమాంధ్ర ప్రజలకు సమస్యలేవైనా ఉంటే ఆంటోని కమిటికి విన్నవించాలని ఆమె సూచించినట్లు కోట్ల తెలిపారు.