తెలంగాణ ఏర్పాటు ఖాయం, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టద్దు: పోన్నం
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజాప్రతనిధులు తెలంగాణ ప్రజలన రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దు అని ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. టిజెఎఫ్ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ తెలంగాణపై టిడిపి, వైఎస్సార్‌సీపీ యూటర్న్ తీసుకోవడం దారుణమన్నారు. సమన్యాయం అంటే ఏమిటో వైఎస్ విజయమ్మ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇన్ని రోజులు తెలంగాణ వనరులను దోచుకున్నామని చెప్పకనే చెప్పారు. హైదరాబాద్ లేని తెలంగాణను ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. సీమాంధ్రలో జాతీయ నేతల విగ్రహాలు కూలగొడుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని నిప్పులు చెరిగారు.