రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కొండపాక,(జనంసాక్షి): మెదక్‌జిల్లా కొండపాక మండలం లకుడారం శివారులోని రాజీవ్ రహదారిపై ద్విచక్రవాహనం, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీశైలం (55) తీవ్రంగా గాయపడి సిద్దిపేట ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుకునూరు పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.