కేటీపీఎన్‌లో కెమికల్ ల్యాబ్ ప్రారంభం
పాల్వంచ,(జనంసాక్షి): పాల్వంచలోని కేటీపీఎస్‌లో రూ.కోటీతో నూతనంగా నిర్మించిన కెమికల్ ల్యాబ్‌ను శనివారం ఏపీ జెన్‌కో డైరెక్టర్ (ప్రాజెక్ట్సు) సి.రాధాకృష్ణ ప్రారంభించారు. ల్యాబ్‌ను సద్వానియోగపరుచుకుని త్వరితగతిన పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఈ సిద్ధయ్య ఎస్‌ఈ (సివిల్) అజయ్, బిచ్చన్న, ఆనందం తదితరులు పాల్గొన్నారు.