విధులు బహిష్కరించిన టీ న్యాయవాదులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నిన్న తెలంగాణ న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా ఇవాళ పది జిల్లాల వ్యాప్తంగా లాయర్లు విధులు బహిష్కరించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఛానళ్లను, పత్రికలను బహిష్కరించాలని న్యాయవాదులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సీమాంధ్ర లాయర్లపై కేసులు నమోదు చేయాలని వరంగల్‌ జిల్లా  సుబేదారి పీఎస్‌లో టీ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.