తెలంగాణపై వెనక్కుతగ్గం

ఏపీఎన్‌జీవోలకు చుక్కెదురు
సమస్యలే చెప్పుకోండి
తేల్చేసిన దిగ్విజయ్‌సింగ్‌
న్యూఢిల్లీ, ఆగస్టు 28 (జనంసాక్షి) :
ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలని సమ్మె చేస్తున్న ఏపీఎన్‌జీవోలకు మళ్లీ చుక్కెదురైంది. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని మంగళవారమే వారికి ప్రధాని మన్మోహ న్‌సింగ్‌ తెగేసి చెప్పిన దింపుడు కళ్లం ఆశతో ఎక్కే గడప దిగే గడపగా తిరుగుతున్న ఏపీఎన్‌ జీవోలు, సీమాంధ్ర నేతలకు ఎక్కడా ఓదార్పు దక్కలేదు. బుధవారం ఏపీఎన్‌జీవోలు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జితో భేటీకి ప్రయత్నించి విఫలమయ్యారు. వారి విజ్ఞప్తిని స్వీకరిం చిన దిగ్విజయ్‌ ఆంధ్రప్రదేశ్‌ విభజనపై నిర్ణయమైపోయిందని, ఇక చెప్పుకోవాల్సింది ఏమైనా ఉంటే ఆంటోనీ కమిటీకి చెప్పుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటుపై వెనక్కు తగ్గబోమని, మీ సమస్యలేమైనా ఉంటే చెప్పుకోవాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ కమిటీ తీసుకున్న నిర్ణయానికి పార్టీలోని అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని సీమాంధ్ర నేతలను ఉద్దే శించి వ్యాఖ్యానించారు. అనంతరం ఏపీఎ న్‌జీవోలు ఆయన నివాసం నుంచి బయటికి వచ్చేశారు. అదే సమయంలో రాష్ట్రానికి చెందిన మంత్రులు, ఎంపీలు వట్టి వసంత కుమార్‌, ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీ రారెడ్డి, ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలో దిగ్విజయ్‌ సింగ్‌తో భేటీ అయ్యారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలను వారు మరోమారు డిగ్గీకి వివరించారు. తాము చేస్తున్న ప్రయత్నమల్లా రాష్ట్రం ఐక్యంగా ఉండేందుకేనని వారు అనంతరం వెల్లడించారు. రాయల తెలంగాణపై జేసీ దివాకర్‌ రెడ్డి ప్రతిపాదన చేసిన ఆయన వ్యక్తిగతమని మంత్రి రఘువీరా అన్నారు. ఇందులో తాను ప్రత్యేకంగా ఇలాంటి ప్రతిపాదనలేవీ చేయలేదన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెనక్కి తీసుకునేలా ఒత్తిడి తెస్తున్నామని మంత్రి ఆనం అన్నారు. వెనక్కి తీఉకునే అవకాశాలు కొట్టి పారేయలేమని చెప్పినా ఆయన చెప్పడంలో విశ్వాసం కనిపించలేదు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిదని దిగ్విజయ్‌ చెప్పడంతో దిమ్మతిరిగిన సీమాంధ్ర ఉద్యోగులు ఆయన కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. సీమాంధ్ర ప్రాంత సచివాలయ, విద్యుత్‌ సౌధ ఉద్యోగులు ఈరోజు ఢిల్లీలో రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందన్న దిగ్విజయ్‌ వ్యాఖ్యలకు ఆగ్రహం వ్యక్తం చేసిన వారు ఆయన కార్యాలయం ఎదుట సమైక్య నినాదాలు చేపట్టారు. అంతకు ముందు దిగ్విజయ్‌తో సమావేశమైన రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రఘువీరా, ఆనం, అనంత వెంకట్రామిరెడ్డిని సీమాంధ్ర ఉద్యోగులు దిగ్విజయ్‌ నివాసం వద్ద చుట్టుముట్టి సమైక్య నినాదాలు చేసారు. తాము సమైక్యాంధప్రదేశ్‌ కోరుకుంటున్నామని వారు డిమాండ్‌ చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేత సుష్మాస్వరాజ్‌ను ఏపీఎన్జీవో నేతలు కలిశారు. రాష్ట్రన్ని సమైక్యంగా ఉంచేందుకు సహకరించాలని ఈ సందర్భంగా వారు సుష్మాస్వరాజ్‌ను కోరారు. దీనికి స్పందించిన సుష్మాస్వరాజ్‌ విభజనపై వెనక్కు తగ్గేది లేదని మీ అభ్యంతరాలు తెలపాలని ఎన్జీవోలను కోరినట్లు సమాచారం.