వ్యవసాయం కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం
ఇందిరాగాంధీజ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేద వర్గాలకు గేదెలు, గొర్రెలు లాంటివి ఉచితంగా ఇవ్వడంతోఓ ప్రారంభమైన ఈ తతంగాలు నేడు, టివిలు, గ్రైండర్లు, ల్యాప్‌టాప్‌ల వరకూ చేరుకున్నాయి. రూపాయికి కిలో బియ్యం లాంటి పథకాలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు ఖర్చయ్యే సొమ్మంతా ప్రజల సోమ్మే అనేది మరచిపోరాదు. ఈ విధానాలతో ప్రజలను నిరంతరం ప్రభుత్వం విదిలించే మెతుకుల కోసం ఆధారపడే సమూహాల్ని తయారు చేయడమే ప్రధాన ఉద్దేశ్యం. ఈ బిల్లుపై స్పందిస్తూ ఈ పథకం లబ్దిదారుల్లో దాదాపు సగం మంది రైతులే. అంటే రైతు వద్ద పండించిన ధాన్యాన్ని రైతులకే ఇస్తారన్న మాట. ఇలా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చౌకధరలకు తిండి గింజలు అందించే బదులు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. చిన్న చిన్న సాగునీటి ప్రాజెక్టులు నిర్మించవచ్చు. అప్పుడు రైతుకలు చవకగా లభించ సరుకుల కోసం ఆశించ పరిస్థితికి బదులు, తమను తాము పోషించుకుంటారు. అని భారతీయ కృషక్ సమాజ్ అధ్యక్షుడు అజయ్ ఝూకర్ అన్నారు. తక్కువదిగుబడి, సాగునీటి వసతి లేమి, యాత్రీకరణలో వెసులు బాటు, మౌలిక సదుపాయాల కొరత, వీటన్నిటి నేపధ్యంలో వ్యవసాయం సంక్షభం ఎదుర్కొంటుంటే, ఈ సమస్యల్ని పరిష్కరిదంచకుండా నేరుగా రైతుల సంచిలో తిండి గింజలు వేసి అదే గొప్పగా చెప్పుకోవడమేమిటని అనేక వ్యవసాయ నిపుణులకు ప్రశ్నిస్తున్నారు. బియ్యం, గోధుమలు ఇస్తే సరిపోతుందా? వంట చెరుకు, వంట నూనె, వస్త్రాలు, సబ్బులు, గృహ వసతి, చవుక రవానా సౌకర్యాలు, తాగునీరు, విద్యుత్తు తక్కువ ధరలకు ఎవరు సమకూరుస్తారని కూడా అడుగుతున్నారు. ఈ బిల్లు వలన సాధారణ రైతు రూపాయికి కిలో బియ&్యం పొందుతున్నప్పుడు, బాధలు పడి వ్యవసాయం ఎందుకు చేస్తాడు? పంటలు సరిగ్గా పండకపోతే అప్పుడేం చేస్తారు? అంటూ సాక్షాత్తూ పాలకవర్గ భాగస్వామి అయిన ఆహార శాఖా మంత్రి శరద్ పవార్ చిరాకు పడ్డారు. లక్షలాది మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైన ఈ నాయకుడికి రైతుల పట్ల ఇంతకన్నా మంచి అభిప్రాయముండే అవకాశం లేదని, మనకు తెలుసు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఆహార భద్రత కోసం అదనంగా కలిపిన పదివేల కోట్ల రూపాయలతో పాటు మొత్తం ఆహార సబ్సిడీ కోసం 90 వేల కోట్ల రూపాయాలు కేటాయించారు. కాని ఆహార మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ఈ బిల్లు అమలు వలన దాదాపు 1.3 లక్షల ఓటల& రూపాయలు ఖర్చు అవుతాయని అంచానా, కమిషన్ ఆన్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ అంచానా ప్రకారం ఈ పథకం అమలుకు మొదటి సంవత్సరం 2.41 లక్షల కోట్ల రూపాయలు, మూడు సంవత్సరాల తర్వాత ఆహార ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన ఖర్చు 1.1 లక్షల కోట్లుతో కలిపి 6.82 లక్షల కోట్ల రూపాయలు కేటాయించాలి.
వ్యవసాయ రంగంలో జరిగిన విధ్వంసం
ఎన్డీఏ హయంలో వాజ్‌పేయి అధికారంలోకి రాగానే ప్రపంచ బ్యాంక్ మన దేశ వ్యవసాయ రంగంలో చేయాల్సిన మార్పులు గురించి చాలా స్పష్టమైన ఆదేశాలిచ్చింది. వాటిలో 1) ఎక్కువ లాభాలు రాని పంటలను తగ్గించాలి. 2) ఎగుమతులకు అవసరమై పంటలు పండించి, అవసరమైన ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవాలి. 3)వ్యవసాయంలో విదేశాలతో పోటీ పడాలి. 4) ఎరువులు, విత్తనాలు, నీరు, రుణాలు వంటి అంశాలలో ఇస్తున్న సబ్సిడీలను పూర్తిగా తగ్గించాలి. 5) ఇక్కడ పండించిన పంటల ఎగుమతులపై ఎట్టి అడ్డంకులు ఉండరాదు. 6) విదేశా నుండి వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ఎలాంటి ఆంక్షలు ఉండరాదు. 7) ఆహార ధాన్యాల కొనుగోలు, రవాణా, నిలవ లాంటి అంశాలలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సిఐ) జోక్యాన్ని తప్పించి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలి. వ్యవసాయ రంగంలో స్వావలంబనకు పూర్తిగా నాశనం చేస్తూ సామ్రాజ్యవాదులపై ఆధారపడే విధంగా ఉన్న ఈ ఆదేశాలను, మన పాలకులు అత్యంత విశ్వాస పాత్రులుగా అమలు చేశారు. పై ఆదేశాల కనుగుణంగానే 2000లో వ్యవసాయం రంగం అభివృద్ది కొరకు చాలా గొప్పగా పొగడుతూ ప్రభుత్వం విడుదల చేసిన 15 పేజీల నేషనల్ అగ్రికల్చరల్ పాలసీ’ ఉంది. అందులో స్పష్టంగా వ్యవసాయ రంగంలో కాంట్రాక్టు వ్యవసాయం చేపట్టి, ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించాలని, ప్రపంచ మార్కెట్‌కు అవసరమై పత్తి, ఆయిల్ సీడ్స్, పూల మొక్కలు లాంటి వ్యాపార పంటలు పండించాలని ఉంది. భూకమతాల సైజుని విస్తృతం చేయాలని, రైతుల భూములు ప్రైవేట్ వ్యక్తులకు, సంస్థలకు అప్పచెప్పడానికి అవసరమైన చట్టాలు తీసుకురావాలని ఉంది. అంతేకాక వ్యవసాయాన్ని అభివృద్ది చేస్తూ పలు రకాల కొత్త మొక్కల అభివృద్దికి అవసరమై పరిశోధనలలో ప్రైవేట్ కంపెనీలకు ప్రోత్సాహం కల్పించాలి. ఈ క్లాజ్ వల్లనే మన దేశంలో ఇప్పటికే బహుళ జాతి సంస్థ మహికో జన్ము మార్పిడి విత్తనాలపై పెత్తనం చేస్తోంది. ఆహార భద్రత అంటే గోడౌన్ నిండా ఆహార ధాన్యాలు నిండి ఉండడం కాదు. జేబుల నిండా డాలర్లు కలిగి ఉండడమే. బాగా లాభాలు వచ్చే వ్యాపార పంటలు పండించండి. ఎగుమతులు చేసి సంపాదించి, అవసరమైతే కొంత లాభంలో ఆహారాన్ని దిగుమతి చేసుకోండి అని సామ్రాజ్యవాదానికి ప్రతినిధి అయిన అమెరికా వ్యవసాయ కార్యదర్శి సెలవిచ్చారు. ఆ స్ఫూర్తితోనే మన దేశంలో ఆహార ధాన్యాల నిలవ, రవాణాల గురించి ప్రపంచ బ్యాంక్ డాక్యుమెంట్‌లో చేసిన ప్రతిపాదనలు చూడండి. 1)ధాన్యాల కొనుగోళ్లు వాటి రవాణా, నిలవ చేసే కార్యక్రమాలలో ఆహార సంస్ధ (ఎఫ్‌సిఐ) తన ప్రత్యక్ష పాత్ర తగ్గించుకోవాలి. ఈ కార్యక్రమాల్ని సబ్ కాంట్రాక్టుల ద్వారా లైసెన్స్‌డ్ ఏజెంట్లకు, టోకు వ్యాపారస్తులకు, ప్రైవేట్ వ్యాపారస్తులకు అప్పగించాలి. 2)ధాన్యాల బఫర్ నిల్లను వర్కింగ్ స్టాక్‌లతో పేర్చుకొనే బదులు ఆహార సంక్షభ కాలంలో భారతదేశం ప్రపంచ మార్కెట్‌ను ఆశ్రయించవచ్చు. పెద్ద ఎత్తున గోధుమలు,. బియ్యం, బఫర్ నిల్లను, వర్కింగ్ స్టాక్‌లను నిల్ల చేసుకోవడమంటే చాలా ఖర్చుతో కూడిన పని అలా పేర్చుకోవడం అవసరం లేదు. ముఖ్యంగా మార్కెట్ జోక్యం లక్ష్యం మారుతున్న దృష్ట్యా ఈ మార్పులు చాల అవసరం. పై సూచనలకనుగుణంగా 1998 సెప్టెంబర్‌లో కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడానికి ఏర్పాటు చేసిన సారధ్య సంఘం గోధుమలు, బియ్యం సేకరణ వాటి రవానా నిలవ చేయడం లాంటి వాటి బాధ్యతలు ప్రైవేట్ రంగానికి అప్పగించాలని, ఈ రంగంలోకి ప్రైవేట్ పెట్టుబడులను విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాలని సిఫారసు చేసింది. వీటిని ప్రభుత్వం ఆమోదించింది. దేశంలో ఆహార ధాన్యాల నిలవ కోసం అవసరమైన గైడౌన్ల నిర్మాణం లోనూ, నిర్వహణలోనూ నలభై సంవత్సరాల అనుభం ఉన్న భారత ధాన్య గిడ్డంగి నిర్వహణ పరిశోధనా సంస్థ (ఇండియన్ గ్రెయిన్ స్టోరేజ్ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చీ ఇన్‌స్టిట్యూట్ ఐడింఎఆర్‌ఐ)ను కాదని ఆస్ట్రేలియా వ్యవస్థను ప్రవేశ పెట్టాలని ఈ సిఫారసులలో ఉంది. దీనికి అనుగుణంగానే కేద్రం మంత్రివర్గం జాతీయ నిల్వల విధానం (నేషనల్ గ్రెయిన్ స్టోరేజ్ పాలసీ)ని ప్రనకటించింది. మౌలికమైన ఏర్పాట్లు ప్రైవేట్ రంగం ద్వారా ఏర్పాట్లు చేయాలని, అలా ఏర్పడే గిడ్డంగులను ఎఫ్‌సిఐకు అద్దెకివ్లాని, అనేక రాయితీలు కల్పిసూఐ్త ప్రైవేట్ పార్టీలకు ఎఫ్‌సిఐ స్థలాన్ని నూటికి నూరుపాళ్ళు వాడుకొనే అవకాశం కల్పించాలని, వారు ఐదు సంవత్సరాలు ఆదాయ పన్ను చెల్లించనక్కర్లేదని ప్రకటించారు. దేశ వ్యాప్తంగా ఎఫ్‌సిఐకి ఉన్న 2200 గోడౌన్లలో 510 గోడౌన్లలను మినహాయించి మిగతా వాటిని ప్రైవేట్ కంపెనీలకు అమ్మేయాలని కేంద్ర వినియోగదార్ల పంపిణీ మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది.
-పివి రమణ