నిమ్స్‌ను ముట్టడించిన ఓయూ జేఏసీ
హైదరాబాద్,(జనంసాక్షి): నిమ్స్ ఆసుపత్రిని ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థులు ముట్టడించారు. తెలంగాణకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌ను తీహార్ జైలుకు తరలించాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.