హైదరాబాద్‌ది గొప్ప సంస్కృతి : స్వామిగౌడ్
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ సంస్కృతి చాలా గొప్పదని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ చెప్పారు. ఆనాడే హైదరాబాద్‌లో ఆస్పత్రులు, కళాశాలలు, పాఠశాలలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇప్పుడేమో తాము అభివృధ్ది చేశామని సీమాంధ్ర నేతలు చెప్పడం అర్ధరహితమన్నారు. సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌కు వచ్చి ఇక్కడి చరిత్రను మరుగున పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.