యూటీ అంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం


పది జిల్లాల తెలంగాణే కావాలి : కోదండరామ్‌
నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 (జనంసాక్షి) :
హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ముల్కీ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ కోసం 1952 నుంచి ఉద్యమాలు జరుగుతునే ఉన్నాయి. అప్పట్లో నాన్‌ ముల్కీ లడాయితో ప్రత్యేక రాష్ట్రం ఉద్యమానికి శ్రీకారం చుట్టినట్ల యింది. నాటి నుండి స్వార్థపరులు తెలంగాణను అడ్డుకూంటునే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ ఏర్పాటు అపడం ఎవరితరం కాదని అన్నారు. ప్రాంతాలుగా వీడిపోయి అన్నదమ్ములుగా కలిసి ఉందామని తెలంగాణవాదులు కోరుకుంటే మరొవైపు అలా వద్దు కలిసుందామని జబర్దస్తీ చేయడం ఎంత వరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. ప్రేమ వ్యవరహారంలో ఈరోజుల్లో జరుగుతున్న యాసిడ్‌ దాడులతో సమైక్య ఉద్యమాన్ని పోల్చారు. తెలంగాణ ఉద్యమానికి సోయి తెచ్చింది నాటి నాన్‌ ముల్కి ఉద్యమమేనన్నారు. ఆంధ్రపాలకులు, తెలం గాణ ప్రాంతీయులకు కూరగాయాల్లోని కరివేపాకుల చూస్తు వచ్చారని, ఇక ఓపిక సహించని తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం తప్పేమి లేదని అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ పార్టీ మొదటి నాన్చుడు ధోరణి అవలంబించిన తెలంగాణలో జరిగిన ఉద్యమానికి కళ్లు తెరచి చూడాలన్నారు. ఇందులో భాగంగానే ఇటీవల సిడబ్ల్యుసిలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానించిందన్నారు. 20 రోజుల్లో తెలంగాణపై నోట్‌ తయారు చేస్తున్నామని కేంద్ర హోంశా ఖమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే తాజాగా ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. పార్లమెంట్‌లో, రాజ్యసభలో తెలంగాణ బిల్లు పెట్టి సమకూల నిర్ణయం లభించే వరకు నమ్మేది లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ విషయంలో టిడిపి, వైఎస్సార్‌ సీపీ గతంలో ఒక మాట ప్రస్తుతం మరొక్క మాట మాట్లాడడం విచారకరమన్నారు. గెలవడానికి తెలంగాణ ప్రాంత ఓట్లు కావాలి తప్ప ప్రత్యేక రాష్ట్రం కావడం వారికి ఇష్టం లేదన్నారు. వచ్చిన తెలంగాణను తాను గతంలోను తాజాగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన విషయాలను గుర్తు చేశారు. హైదరాబాద్‌ కోసమే సమైక్యావాదులు పేచి పెడుతున్నారని, హైదరాబాద్‌ను తామే అభివృద్ధి చేశామని చిలుకపలుకులు పలుకుతున్నారని ఆరోపించారు.