7వ బెటాలియన్ సిబ్బందికి సేవాపతకాలు
నిజామాబాద్,ఆగస్ట్10(జనంసాక్షి): ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్ సిబ్బంది సేవలకు గుర్తింపుగా ఉత్కిష్ట్ర్, అతి ఉత్కిష్ట్ర్ సేవా పతకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని బెటాలియన్ కమాండెంట్ ఎస్‌వీ.సత్యనారాయణ తెలిపారు. దీంట్లో భాంగా ఏపీఎస్‌పీ 7వ బెటాలియన్‌లో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.రవిందర్, జి.నిరంజన్, జె.సుభాష్, కే.గంగయ్య, ద్యానేశ్వర్ గోవింద్‌లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఉత్కిష్ట్ర్ సేవాపతకాలను ప్రకటించాయి. ఏఆర్‌ఎస్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్.లక్ష్మణ్ సేవలను గుర్తించి అతి ఉత్కిష్ట్ర్ సేవాపతకాన్ని ప్రకటించాయి.