తెలంగాణకు 7 కేంద్రీయ విద్యాలయాలు

హైదరాబాద్‌ : తెలంగాణలో ఏడు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీమాంధ్రలో మూడు కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జైరాంరమేశ్‌ ప్రకటించారు. ప్రతి విద్యాలయానికి కేంద్రం నుంచి రూ. 15 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నిపుణుల కమిటీ సీమాంధ్రకు రాజధానిని ఎంపిక చేస్తుందని పేర్కొన్నారు.