70 ఏళ్ల వయసులో తొలిసారిగా ఓటేసిన గద్దర్
హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని అల్వాల్ పరిధి భూదేవినగర్‌లో స్థానిక పాఠశాలలో ప్రజా గాయకుడు గద్దర్ తొలిసారిగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. 70 ఏళ్ల వయసులో కుటుంబ సమేతంగా వచ్చి తొలిసారి తన ఓటు హక్కు వినియెగించుకున్నట్టు ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని మంచి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవాలని గద్దర్ కోరారు.