-->

తెలంగాణను అడ్డుకునే సత్తా సీఎంకు లేదు


న్యూఢిల్లీ, అక్టోబర్‌ 21 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం ఎప్పుడో జరిగిపోయిందని, విభజనను అడ్డుకునే సత్తా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌కి లేదని ఏఐసీసీ అధికార ప్రతినిధి సందీప్‌ దీక్షిత్‌ పేర్కొన్నారు. రాష్టాల్ర విభజనను ముఖ్యమంత్రులు అడ్డుకోలేరని సీఎంకు కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణపై రెండేళ్లుగా సంప్రదింపులు జరిగిన తరవాతనే ముందుకు వెల్లడం జరిగిందన్నారు. అలాగే పార్లమెంట్‌ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. విభజన పక్రియ కొనసాగుతుందన్నారు. రెండేళ్ల సంప్రదింపుల తర్వాతనే తెలంగాణ ఏర్పాటు-పై నిర్ణయం జరిగిందన్నారు. మంత్రుల బృందం (జీవోఎం) సంప్రదింపులు కొనసాగుతున్నాయని చెప్పారు. సంప్రదింపులు పూర్తయ్యాక ఆ అంశాలను తెలంగాణ బిల్లులో పొందుపరుస్తామని చెప్పారు. విభజన పక్రియను ముఖ్యమంత్రులు అడ్డుకోలేరన్నారు. కిరణ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న అధిష్టానం ఈ విధంగా కౌంటర్‌ ఇచ్చింది. ఫైలిన్‌ తుఫానును తాను ఆపలేకపోయానని కానీ విభజన పక్రియను మాత్రం ఆపుతానని ముఖ్యమంత్రి ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై ఆంధప్రదేశ్‌ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ మాట దాటవేశారు. దానిపై స్పందించలేదు. అయితే ముఖ్యమంత్రులు విభజనను అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సందీప్‌ మాట్లాడుతూ విభజన ప్రక్రియ ఆగదన్నారు.ఇదిలావుంటే ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ బిల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందుతుందని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్టికల్‌ 371(ఆ) విభజనకు ఆటంకం కాదన్నారు. దాని వల్లే తెలంగాణకు తీరని నష్టం జరిగిందన్నారు. సీమాంధ్ర నేతలు కొందరు ఆటంకవాదుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాపోలు ఆనంద్‌భాస్కర్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ సారథ్య బృందం నేడు సమావేశమయింది. రాష్ట్ర విభజనతో ముడిపడిన తెలంగాణ అంశాలపై జీవోఎంకు నివేదిక సమర్పించాలని నిర్ణయించినట్టు- తెలిపారు. వచ్చే ఏడాది మార్చినాటికి విభజన పక్రియ పూర్‌ఖ్తె రెండు రాష్టాల్రు ఏర్పడుతాయన్న నమ్మకాన్ని కాంగ్రెస్‌ నేతలు వెలిబుచ్చారు. జీవోఎంకు ఇచ్చే నివేదికపై తుది కసరత్తు కోసం ఈనెల 25 మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.