ఖమ్మం జిల్లా కొణిజెర్లలో విజయమ్మకు తెలంగాణ సెగ
ఖమ్మం : జిల్లాలోని రైతులను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మికి తెలంగాణ సెగ తగిలింది. కొణిజెర్ల వద్ద తెలంగాణవాదులు విజయలక్ష్మి కాన్వాయ్‌ని అడ్డుకుని కోడిగుడ్లు విసిరారు. పోలీసులు తెలంగాణవాదులపై లాఠీఛార్జి చేశారు. దీంతో పలువురు తెలంగాణవాదులు గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.