సచిన్‌ లేక ఇక క్రికెట్‌

ముగిసిన సువర్ణ ఇన్నింగ్స్‌
రిటైర్మెంట్‌ రోజే భారతరత్న
భావోద్వేగానికి లోనైన సచిన్‌
భుజాలపైకి ఎత్తుకొని సహచరుల సాదర వీడ్కోలు
చప్పట్లతో మార్మోగిన స్టేడియం
ముంబై, నవంబర్‌ 16 (జనంసాక్షి) :
భారత సూపర్‌ బ్యాట్స్‌మన్‌, మాస్టర్‌ బ్లాస్టర్‌ లేకుండానే ఇకపై క్రికెట్‌ మ్యాచులుంటాయి. ఊహించుకోవడానికే కష్టంగా అనిపించినా ఇది చేదు నిజం. హోం గ్రౌండ్‌ ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్‌ చారిత్రక, చివరి 200వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌ను ఘన విజయంతో ముగించాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోజే భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించింది. మ్యాచ్‌ గెలవగానే సచిన్‌ భావోద్వేగానికి గురయ్యాడు. 24 ఏళ్లుగా ఆడుతున్న క్రికెట్‌ను వీడుతున్న సందర్భంగా కన్నీళ్లు పెట్టుకున్నాడు. సహచరులు ఆయనను భుజాలపైకెత్తుకొని ఘనంగా వీడ్కోలు పలికారు. సచిన్‌కు దేశవిదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. క్రికెట్‌కు సచిన్‌ అందించిన సేవలు మరువలేనివని, లక్షలాదిమందికి ప్రేరణ కలిగించిన గొప్ప ఆటగాడు సచిన్‌ అని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. సచిన్‌కు భారతరత్న ఇవ్వడం దేశానికి మంచి సందేశం పంపినట్లవుతుందని పేర్కొంది. క్రీడా ప్రపంచానికి సచిన్‌ సిసలైన రాయబారి అని కొనియాడింది. ఇదిలావుంటే సచిన్‌కు భారత రథ్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఫేస్‌బుక్‌, ట్వట్టర్లలో సచిన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. సచిన్‌కు భారత రత్న ప్రకటించడంపై కేంద్ర మంత్రి రాజీవ్‌ శుక్లా సంతోషాన్ని వ్యక్తం చేశారు. సచిన్‌ను ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, ఆయన నుంచి ఎప్పుడూ స్ఫూర్తి పొందుతారని కొనియాడారు. సచిన్‌ పేరిట ఉన్న రికార్డులను వందేళ్ల వరకూ ఎవరూ చెదరగొట్టలేరని అన్నారు. సచిన్‌కు భారతరత్న సముచితమని సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. అతనో గొప్ప క్రికెటరే కాక మానవతావాది అని అన్నారు. అతడికి భారతరత్న ఇవ్వడం సముచిత నిర్ణయమని, ఇందుకు కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నకు సచిన్‌ నిజమైన అర్హుడు అని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమీర్‌ఖాన్‌ కొనియాడారు. ఆయనకు భారత రత్న పురస్కారాన్ని ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేశారు. భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను సచిన్‌కు ప్రకటించినందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో చంద్రబాబు విూడియాతో మాట్లాడుతూ సచిన్‌ ఆటతోపాటు గొప్ప విలువలు నెలకొల్పిన మ¬న్నత వ్యక్తి అని కొనియాడారు. సచిన్‌ యువతకు ఆదర్శప్రాయమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరారు. సచిన్‌కు భారత రత్న ఇవ్వడం దేశాన్ని, జాతిని గౌరవించుకున్నట్లని పేర్కొన్నారు. దేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌, ప్రముఖ శాస్త్రవేత్త ప్రొ.సీఎన్‌ఆర్‌ రావుకు కేంద్రం ప్రకటించడం పట్ల వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హార్షం వ్యక్తం చేశారు. సచిన్‌, రావులకు ఈ సందర్భంగా జగన్‌ అభినందనలు తెలిపారు. సచిన్‌ అసమాన ప్రతిభకు భారతరత్న పురస్కారం ప్రకటించడం ముదావహం అని ఆయన పేర్కొన్నారు.సచిన్‌ అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. భారత క్రికెట్‌కు విశేషసేవలందించిన సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం లభించింది. సచిన్‌కు దేశపు అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మాస్టర్‌ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలికిన కొన్ని గంటల్లోనే ఈ ప్రకటన రావడం విశేషం. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. దీంతో క్రీడారంగంలో భారతరత్న అందుకోబోతోన్న తొలి ఆటగాడిగా సచిన్‌ చరిత్ర సృష్టించాడు. అలాగే ఈ పురస్కారాన్ని అందుకోబోతోన్న అతిపిన్న వయస్కుడు సచినే. క్రీడారంగానికి సచిన్‌ గొప్ప ప్రచారకర్తగా ప్రధాని కార్యాలయం ప్రశంసించింది. పురస్కారానికి సంబంధించిన ప్రకటనలో సచిన్‌పై ప్రశంసలు కురిపించింది. భారత్‌లోనే కాకుండా ప్రపంచపు క్రీడారంగానికి అతిగొప్ప బ్రాండ్‌ అంబాసిడర్‌గా సచిన్‌కు కితాబిచ్చింది. నిజానికి దేశంలో అత్యున్నత పురస్కారంగా ఉన్న భారతరత్న గతంలో ఎప్పుడూ క్రీడారంగానికి ఇవ్వలేదు. అయితే గత కొంతకాలంగా సచిన్‌తో పాటు హాకీ లెజెండ్‌ ధ్యాన్‌చంద్‌ పేర్లు ఈ పురస్కారానికి అర్హులుగా ఉన్నాయన్న డిమాండ్‌ వినిపిస్తోంది. దీంతో భారతరత్న నిబంధనల్లో కేంద్రం గత ఏడాది మార్పులు కూడా చేసింది. క్రీడారంగానికి కూడా వర్తింపజేసేలా నిబంధనలు మార్చింది. నిజానికి సచిన్‌ రిటైర్మెంట్‌కు ముందు ఆడిన చివరి టెస్టు ప్రారంభమైనప్పటి నుండీ కాంగ్రెస్‌ ఎంపీ రాజీవ్‌శుక్లా దీనిపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. సచిన్‌ పేరును పరిశీలిస్తున్నట్టు విూడియాకు చెప్పారు. అయితే రిటైర్మెంట్‌ రోజే ప్రకటన వస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. జీవించి ఉన్న వారిలో ఈ పురస్కారం అందుకోనున్న ఐదో వ్యక్తి సచిన్‌. ప్రస్తుతం జీవించి ఉన్న వారిలో అబ్ధుల్‌ కలామ్‌ , లతా మంగేష్కర్‌ , అమర్త్యసేన్‌ , నెల్సన్‌ మండేలా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. వచ్చే ఏడాది గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా సచిన్‌కు దీనిని అందించే అవకాశాలున్నాయి. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు భారత అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 24 ఏళ్లుగా క్రికెట్‌కు సచిన్‌ అందించిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ‘భారతరత్న’కు ఎంపికైన తొలి క్రికెటర్‌ సచినే. ఈ పురస్కారానికి ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడు కూడా ఆయనే. అంతర్జాతీయ మ్యాచ్‌లకు వీడ్కోలు పలికిన రోజునే కేంద్ర ప్రభుత్వం సచిన్‌కు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. సచిన్‌తోపాటు ప్రధాని సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్‌ సి.ఎన్‌.ఆర్‌. రావుకు కూడా కేంద్రం భారతరత్న ప్రకటించింది. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను సచిన్‌కు ప్రకటించినందుకు టిడిపి అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో చంద్రబాబు విూడియాతో మాట్లాడుతూ సచిన్‌ ఆటతోపాటు గొప్ప విలువలు నెలకొల్పిన మ¬న్నత వ్యక్తి అని కొనియాడారు. సచిన్‌ యువతకు ఆదర్శప్రాయమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని కోరారు. సచిన్‌కు భారత రత్న ఇవ్వడం దేశాన్ని, జాతిని గౌరవించుకున్నట్లని పేర్కొన్నారు.