గన్‌పార్క్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ధర్నా
హైదరాబాద్: రాయల తెలంగాణ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ తెలంగాణ జ్నలిస్టుల ఫోరం గన్‌పార్క్ వద్ద ధర్నా నిర్వాహించింది. వెయ్యి మంది యువకుల బలిదానాల తర్వాత వస్తుందనుకుంటున్న తెలంగాణకు రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ మరో ఆటంకం కల్పిస్తోందని జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయల తెలంగాణను సమర్థించే వారంతా తెలంగాణ ద్రోహులేనని టీజేఏసీ కో ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కేబినేట్‌కు జీవోఎం సమర్పించే బిల్లులో రాయల తెలంగాణ ప్రతిపాదన ఉంటే… ఆ బిల్లు పార్లమెంటుకు రాకముందే మరోసారి సకలజనుల సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. రాయల తెలంగాణ మద్దతుదారులు, సమైక్యవాదులు లక్ష్యంగానే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. 10 జిల్లాల తెలంగాణ తప్ప ఇతర ప్రత్యామ్నాయాలు వేటినీ అంగీకరించే ప్రసక్తేలేదని శ్రీనివాస్ గౌడ్ తేల్చి చెప్పారు. రాయల తెలంగాణ అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో భూస్థాపితం అవుతుందన్నారు.