తణుకు ఎమ్మెల్యే వాహనంపై వైకాపా కార్యకర్తల దాడి
తణుకు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ తణుకులో చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తణుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వెంకట నాగేశ్వరరావు ప్రయాణిస్తున్న కారు అద్దాలను వైకాపా నాయకులు ధ్వంసం చేశారు. దీంతో కాంగ్రెస్, వైకాపా నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటలుచోటు చేసుకున్నాయి. వైకాపా నాయకులురాష్ట్రపతి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. పెద్దఎత్తున పోలీసులు మోహరించారు.