నెల్లూరులో విద్యుత్ ఉద్యోగుల ధర్నా
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు నిరసనగా నెల్లూరులో విద్యుత్ సౌధ వద్ద విద్యుత్ ఉద్యోగుల ఐకాస ధర్నా నిర్వహించింది. ఈ నెల 9న హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల ఐకాస ఛైర్మన్ సాయిబాబా తెలిపారు. ఈ సమావేశంలో నిరవధిక సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.