థాయ్‌లాండ్‌లో పార్లమెంట్ రద్దు :ఎన్నికలకు పిలుపునిచ్చిన ప్రధాని
ఇంటర్‌నెట్‌డెస్క్, హైదరాబాద్: థాయ్‌లాండ్‌లో ప్రస్తుత పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు ప్రధాని ఇంగ్లక్ షనవత్ర సోమవారం ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ సంక్షోభ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడమే తమ ముందున్న ప్రత్యామ్నాయ మార్గమని టెలివిజన్ ద్వారా ఆమె చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. థాయ్ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలందరూ ఆదివారం తమ పదవులకు మూకుమ్మడి రాజీనామాలు సమర్పించారు. గత కొంత కాలంగా థాయ్‌లాండ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్న సంగతులు తెలిసిందే. థాయ్ పార్లమెంటును రద్దు చేస్తూ ఎన్నికలకు పిలుపునిచ్చినప్పటికీ ఉద్యమకారులు శాంతించలేదు. తాము కేవలం ఎన్నికలను కోరుకోవడం లేదని దేశంలో సమూలమైన మార్పులు రావాల్సిన అవసరం ఉందని వారు పేర్కొంటున్నారు. శినవత్ర కుటుంబం దేశాన్ని విడిచివెళ్లాలన్నదే తమ ప్రధానమైన డిమాండ్ అని నిరసనకారులు పేర్కొంటున్నారు. దేశ రాజధాని బ్యాంకాక్ వీధుల్లో ఇప్పటికీ లక్ష మందికి పైగా నిరసన కారులు వివిధ రూపాల్లోతమ నిరసనలు కొనసాగిస్తున్నారు. బ్యాంకాక్ నగరంలోని 60 వేల పాఠశాలలు మూతపడ్డాయి.