సుప్రీం తీర్పును సమర్థించిన భాజపా
ఢిల్లీ: స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీంకోర్టు తీర్పును భారతీయ జనతా పార్టీ సమర్థించింది. సెక్షన్ 377 పట్ల తమ అభిప్రాయం మారదని స్పష్టం చేసింది. ఆదివారం ఈ విషయంపై స్పందించిన పార్టీ పాశ్చాత్య సంస్కృతిని భారత్‌కి తేవడం సరికాదని పేర్కొంది. సెక్షన్ 377పై రాజ్‌నాథ్ సింగ్ చెప్పిందే కరెక్టని, మన సంస్కృతిలోకి పాశ్చాత్య సంస్కృతిని దిగుమతి చేసుకోలేమని పార్టీ ఆధికార ప్రతినిధి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ తెలిపారు.