అటవీ అధికారుల మృతి
తిరుమల, డిసెంబర్‌ 15 (జనంసాక్షి)
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో అటవీ శాఖ సిబ్బందిపై ఎర్రచందనం స్మగ్లర్లు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు అటవీ శాఖ అధికారులు మృతి చెందగా 20మంది సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వంద మంది స్మగ్లర్లు ఈ దాడులకు పాల్పడ్డారని, మరికొందరి జాడ తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన వారిలో ఫారెస్టర్‌ డేవిడ్‌కుమార్‌, డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీధర్‌ ఉన్నట్లు సమాచారం. ఎర్రచందనంఅక్రమ రవాణా అడ్డుకునేందుకు ఆదివారం ఉదయం శేషాచలం కొండల్లోని పార్వే టి మండపం సమీపంలోకి వెళ్లిన సిబ్బందిపై స్మగ్లర్లు రాళ్లతో దాడికి తెగబడ్డారు. అధికారులను పట్టుకుని కర్రలు, రాళ్లతో దాడి చేయడా వారు మృతి చెందినట్లు సమాచారం. గాయపడిన వారిని తిరుమల అశ్వని ఆసుపత్రికి, తిరుపతి రుయా అసుపత్రికి తరలిస్తునాఉ. ఈ ఘటనలో రెండు ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి. దాడి సమాచారం తెలియగానే ఉన్నతాధికారులు అదనపు బలగాలతో ఘటనా స్థలికి బయలుదేరి వెళ్లి కూంబింగ్‌ నిర్వహించారు. శేషాచలం కొండల్లో స్మగ్లర్ల డాది ఘటనపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్మగ్లర్ల దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాల్సిందిగా సీఎం అధికారులను ఆదేశించారు.