ఉద్యమానికి రాజకీయ పార్టీలు సహకరించాలి: అశోక్‌ బాబు

హైదరాబాద్‌: తాము చేస్తున్న ఉద్యమానికి రాజకీయ పార్టీలన్నీ సహకరించాలని ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌ బాబు కోరారు. సమైక్యానికి కట్టుబడి ఉంటామంటున్న పార్టీలు తమ వంతు బాధ్యత నెరవేర్చాలని ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలంతా బిల్లుపై అభిప్రాయం చెప్పాలని సూచించారు. బిల్లులోని ఉద్యోగులకు సంబంధించిన వివాదాస్పద అంశాలపై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ నెల 21న అఖిలపక్ష భేటీ తర్వాత ఉద్యమ కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు. పెద్ద ఉద్యమం ప్రారంభించే ముందు అంచెలంచెలుగా ఉద్యమం ఉంటుందని.. రాష్ట్రం విడిపోకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని హామీ ఇస్తున్నట్లు చెప్పారు.