రోబోల తయారీపై అవగాహన కల్పించే లక్ష్యంతో రోబోటెక్
హైదరాబాద్ : అమెరికాకు చెందిన వెస్ట్ ఫ్లోరిడా యూనివర్శిటీ, బెంగళూరుకు చెందిన నోవాటెక్ రోబో సంస్థలు సంయుక్తంగా హైదరాబాద్‌లో రోబోటెక్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ విద్యార్థులకు అధునాతన సాంకేతిక పరిఙ్ఞానంపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు బిర్లా సైన్స్ సెంటర్‌లో ప్రత్యేక సదస్సు ఏర్పాటైంది. వాడి పడేసిన ఇనుప పరికరాలతో రోబోల తయారీ, వాటి అవసరాలు, సాంకేతిక యుగంలో రోబోల పాత్ర వంటి అంశాలపై నిర్వాహకులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.