కానూరులో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
విజయవవాడ(పెనుమలూరు) : కానూరు శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం (ఎం.పి.సి) చదువుతున్న విజయా చౌదరి(16) తాను ఉంటున్న హాస్టల్ గదిలో సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. విజయా చౌదరి స్వస్థలం కృష్ణాజిల్లా జగ్గయ్య పేట. హాస్టల్‌లో ఉండటం ఇష్టం లేకే ఆత్మహత్యకు పాల్పడిందని తోటి విద్యార్థినులు చెబుతున్నారు.