కుమ్మరుల హక్కుల పరిరక్షణ కోసం పోరు

హైదరాబాద్‌, జనవరి 16: జనాభా ప్రాతిపదికన కుమ్మరులకు రాజకీయంగా భాగస్వామ్యం కల్పించాలని కుమ్మరుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తరిగొప్పుల మహేందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కుమ్మరులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి హక్కుల పరిరక్షణ కోసం గురువారం సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్దించి 67సంవత్సరాలు గడిచినా కుమ్మరులు దుర్భరమైన జీవితాలు వెళ్లదీస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన కుమ్మరులను ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోలేదన్నారు. ఎన్నికలప్పుడు మాత్రం మొసలికన్నీరు కారుస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తమ ఓట్లతో గద్దెనెక్కడం తప్ప చేసిందేమిలేదన్నారు. రానున్న ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా కుమ్మరులు ఒకతాటిపైకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ డిమాండ్ల సాధన కోసం మార్చి2న చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమ్మరులు అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

కుమ్మరలకు రాజకీయ భాగస్వామ్యం కల్పించాలి

జనాభా ప్రాతిపదికన కుమ్మరలకు రాజకీయంగా భాగస్వామ్యం కల్పించాలని కుమ్మర హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో కుమ్మరులు ఎదుర్కొంటున్న సమస్యలు వారి హక్కుల పరిరక్షణకై గురువారం సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మహేందర్‌ మాట్లాడుతూ స్వాతంత్య్ర సిద్ధించి 67 సంవత్సరాలు గడిచినా కుమ్మరలు దుర్బరమైన జీవితాలను వెల్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గానికి చెందిన కుమ్మరల స్థితిగతులపై ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చి మొసలి కన్నీరు కార్చి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కడం తప్ప ఒనగూర్చింది ఏమిలేదని దుయ్యబట్టారు. రానున్న ఎన్నికల్లో జనాభా పాత్రిపదికన కుమ్మరలకు సీట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. 67 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో ఒక్కరు కూడా శాసనసభలో అడుగుపెట్టలేరన్నారు. ఇప్పటికైనా కుమ్మరలు ఒక్కతాటిపైకి వచ్చి ముక్తకంఠంతో రాజకీయ పార్టీలను నిలదీయాలని పిలుపునిచ్చారు. మార్చి 2న కుమ్మరలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించాలని లక్షలాది మందితో చలో హైదరాబాద్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.