ఇబ్రహీంపట్నంలో మూడిళ్లలో చోరీ
మూడు తులాల బంగారం, రూ.40వేల నగదు చోరీ
హైదరాబాద్, జనవరి 16: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గురువారం తెల్లవారుజామున మూడిళ్లలో చోరీ జరిగింది. ఈఘటనలో 3తులాల బంగారం, 40వేల నగదును అపహరించారు. సంక్రాంతి పండుగ సందర్బంగా కుటుంబ సభ్యులు తమ స్వగ్రామానికి వెళ్లారు. దీన్ని గమనించిన దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి తమ పని తాము చేసుకుపోయారు. గురువారం ఉదయం పక్క ఇంటివారు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.