బిల్లుపై చర్చలో నిజాం ప్రస్తావన ఎందుకు
హైదరాబాద్: రాష్ట్ర విభజన చర్చలో నిజాం ఎందుకొచ్చరని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సభులను ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా శాసన సభ్యులు నిజాం ప్రస్తావన తేవడాన్ని తీవ్రంగా ఖండించారు. విభజనకు నిజాం ఎలా కారణం అవుతాడని ప్రశ్నించారు. చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం ఏంటన్నారు.నిజాం గుడ్ రూలర్, గుడ్ లీడర్. చైనాతో యుద్ధం సమయంలో ప్రభుత్వానికి 120కిలోల బంగారం, రూ.9 కోట్లు ఇచ్చాడని గుర్తు చేశారు. చరిత్రలో హైదరాబాద్ మీని దేశంగా ఉంది. దేశాన్ని నిజాం ఎంతో ప్రేమించాడు.ఎన్నో ఆలయాలకు దానాలు చేశాడు. హూస్సేన్ సాగర్‌లో ఫస్ట్ థర్మల్ ప్రాజెక్ట్ పెట్టిన ఘనత నిజాంది. నిజాం పరిపాలనను నెహ్రుకీర్తించాడు. టీడీపీ సమన్వాయం అర్థం ఏంటనీ ప్రశ్నించారు.