మూడు చక్రాల బంద్‌తో ప్రయాణికుల కష్టాలు

హైదరాబాద్‌: నగరంలో ఆటో డ్రైవర్ల బంద్‌ కార్యక్రమంలో మూడో రోజుకి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తుండటంతో బస్సులన్నీ కిటకిట లాడుతున్నాయి.