అంబేద్కర్ విగ్రహన్ని ఆవిష్కరించిన గవర్నర్
హైదరాబాద్: అసెంబ్లీ ఆవరణలో ఈ సాయంత్రం అంబేద్కర్ విగ్రహన్ని గవర్నర్ నరసింహన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్, మండలి చైర్మెన్ చక్రపాణి, సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు హజరయ్యారు. విగ్రహాఆవిష్కరణ సమయంలో తెలంగాణ, సీమంధ్ర ఎమ్మెల్యేలు పోటాపోటీ నినాదాలు ఇచ్చారు. జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర నినాదాలతో అసెంబ్లీ ఆవరణ మొత్తం మారుమోగింది.