‘గిరిజన కెరటం’ మాసపత్రిక ఆవిష్కరణ
హైదరాబాద్: గిరిజన కెరటం మాసపత్రికను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఓయూ వీసీ ఆచార్య ఎన్. సత్యనారాయణతో పాటు తెరాస నేత కె.కేశవరావు, విశ్రాంత పోలీసు అధికారి డీటీ నాయక్‌లు హాజరయ్యారు. గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిని ఆవిష్కరించడానికి ఈ పత్రిక ఎంతగానో తోడ్పడుతుందని వక్తలు తెలిపారు. గిరిజనులకు ఎలాంటి అవకాశాలన్నాయో పత్రిక ద్వారా తెలుసుకునేందుకు వీలు కలుగుతుందని, ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కూడా ఇందులో పొందుపరచాలని వక్తలు సూచించారు.