హైదారాబాద్‌లో కొన సాగుతున్న ఆటోడ్రైవర్ల సమ్మె

హైదరాబాద్‌,జనవరి 20(జనంసాక్షి):నగరంలో ఆటో డ్రైవర్ల సమ్మె కొనసాగుతోంది. పెరిగిన డీజీల్‌,పెట్రోల్‌,
గ్యాస్‌ ధరలకు అనుగుణంగా మీటర్‌ చార్జీలను పెంచాలని ఆటో కార్మికసంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
ఆందోళనను ఉధృతం చేసే దిశలో భాగంగా మంగళవారం ఖైరాతాబాద్‌ లోని రవాణా శాఖ ప్రధాన కార్యల
యాన్ని ముట్టడించాలని కార్మిక సంఘాలు పిలుపు నిచ్చారు.