సంజయ్‌దత్ కు మరో నెల పెరోల్
భార్య ఆనారోగ్యం నేపధ్యంలో మంజూరు
పూణే,.జనవరి 20 (జనంసాక్షి):బాలీవుడ్ నటుడు ,1993 ముంబాయి వరుస బాంబు పేలుళ్ల కేసులో దోషి అయిన సంజత్‌దత్ పెరోల్ గడువును మరో 30రోజులు పొడగిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది డిసెంబర్ ఆరున సంజయ్‌దత్‌కు నెలరోజులు పెరోల్ మంజూరు అయ్యింది.అంతకు ముందు వైద్య కారణాలపై నెలరోజులు పెరోల్‌ను వినియోగించుకున్న అయన అక్టోబర్ 30 న జైలుకు వచ్చారు అలా వచ్చిన అనంతరం గట్టి గా 40 రోజులు కూడా అవకముందే మళ్లీ పెరోల్ మంజూరు చేయడంపై అప్పట్లో తీవ్ర నిరసన వెల్లువెత్తింది.ఈమేరకు విచారణ జరపాలంటూ పూణెలోని ఎరవాడ జైలు వద్ద ఆందోళన కూడా జరిగింది