పేస్ బుక్ లో చిన్నారిని అమ్మకానికి పెట్టిన తల్లి
ఇంటర్‌నెట్ డెస్క్,హైదరాబాద్,జనవరి 21(జనంసాక్షి): చీలీ దేశానికి చెందిన వెరోనిక కర్రేరా అనే 18ఏళ్ల యువతి తన బిడ్డను పేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టింది.చిలీ లోని మైపు పట్టణానికి చెందిన వెరోనికాతో పాటు ఆమె తల్లి, సోదరుని పోలుసులు అరెస్టు చెశారు.వెరోనికా గర్బవతి గా ఉన్నప్పుడు గర్బస్రావం చేయించుకోమని,పాప పుట్టాక బిడ్డను అమ్మమని ,లేదా దత్తత ఇచ్చెయ్యమని తల్లి ,సోదరి ఒత్తిడి తెచ్చినట్లు తమ విచారణతో తేలిందని పోలిసులు చెప్పారు.గత నవంబర్ లో బిడ్డకు జన్మనిచ్చిన వెరోనిక వెంటనే ఫేస్‌బుక్ లో అమ్మకానికి పెట్టగా శాంటియాగోకు చెందిన దంపతులు 1,870అమెరికా డాలర్లకు కొనుగోలు చేసెందుకు ముందుకొచ్చారు.దీని కోసం వారు ఇప్పటికే 113 అమెరికా డాలర్లను వెరోనికాకు చెల్లించారు.వారిని కూడా పోలిసులు తీసుకొని విచారిస్తున్నారు.