75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ
నిజామాబాద్,మార్చి19(జనంసాక్షి): ప్రభుత్వం 75 శాతం సబ్సిడీపై గొల్లకుర్మలకు గొర్రెలను పంపిణీ చేసిందని జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుడు అన్నారు. ఈ నేపథ్యంలో వాటికి ఈనిన గొర్రెపిల్లలకు పౌష్ఠికాహారంతో కూడిన దానాను అందించాలని సూచించారు. గొర్రెలు, మేకలకు పౌష్ఠికాహారమైన పచ్చిగడ్డి, ధాన అందిస్తూ వాటి పెంపకంపై పెంపకం దారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన బాధ్యత పశువైద్యాధికారులపై ఉందని అన్నారు. పశువులు లేదా గొర్రెల, మేకల మేత కోసం ప్రభుత్వం సబ్సిడీపై గడ్డి విత్తనాలను పంపిణీ చేస్తోందని వాటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా పశువైద్యాధికారులు, సిబ్బంది ప్రోత్సహించాలని సూచించారు.