కిరణ్‌ కాన్వాయ్‌లో తగ్గిన వాహనాలు

హైదరాబాద్‌ : కిరణ్‌కుమార్‌రెడ్డి భద్రతను ఇంటలిజెన్స్‌ విభాగం సమీక్షించింది. కిరణ్‌ కాన్వాయ్‌ని పోలీసులు తగ్గించారు. ప్రస్తుతం ఉన్న బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు తొలగించారు. ఐదు వాహనాలు, అంబులెన్స్‌ తొలగింపు, ఒక బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనంతోపాటు 2కొత్త టయోటాలు కేటాయించారు. మాజీ సీఎంలకు కల్పించే భద్రత కిరణ్‌కు ఏర్పాటు చేస్తున్నారు.