నగరంలో పలు చోట్ల భారీవర్షం

హైదరాబాద్‌:ఇవాళ నగరంలో పలు చోట్ల వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన అల్పపీడన ద్రోణి కారణంగా ఈదురు గాలులతో వర్షం కురిసింది. బలమైన అల్పపీడన ద్రోణి కారణంగా ఈదురు గాలులతో వర్షం పడేతోంది. బంజారహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, గచ్చిబౌలి, మాదాపూర్‌, దిల్‌షుక్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్బీనగర్‌తో పాటు పటు చోట్ల వర్షం కురిసింది. రోడ్లపై భారీగా నీరు చేరి డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.