విలీనం చేయొద్దు


తెలంగాణ పునర్నిర్మించుకోవాలి
మంద కృష్ణ హితవు
హైదరాబాద్‌, మార్చి 4 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర సమితిని కాంగ్రెస్‌లో విలీనం చేయవద్దని, తెలంగాణను పునర్నించుకోవాలని, అందుకు ఉద్యమ పార్టీ అవసరమేనని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ పార్టీగానే కొనసాగాలని మందకృష్ణ సూచించారు. టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. రాయల తెలంగాణ వ్యతిరేకించిన కేసీఆర్‌.. ముంపు ప్రాంతాలపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. టీ కాంగ్రెసు నేతలు విలీనం చేయాలని అడగటం హాస్యాస్పదమన్నారు. రమ్య ఫిర్యాదు కెసిఆర్‌పై ఆయన అన్న కూతురు రమ్య హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. కేసీఆర్‌ను విమర్శించినందుకు తన ఫంక్షన్‌ హాల్‌పై దాడి చేయడమే కాకుండా తన భర్తపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులను అక్రమంగా పెట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారంలోకి రాకముందే టీఆర్‌ఎస్‌ బెదిరింపులకు దిగుతోందన్నారు. కుటుంబ పునాదులనే కాపాడుకోలేని కేసీఆర్‌ తెలంగాణ పునర్నిర్మాణం ఏం చేస్తారని ప్రశ్నించారు.