మలేషియా సముద్రంలో కూలిన విమానం
232 మంది గల్లంతు
గల్లంతయిన వారిలో ఐదుగురు భారతీయులు
కౌలాలంపూర్, మార్చి 8 (జనంసాక్షి) :
మలేషియా ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం వియత్నాం వద్ద సముద్రంలో కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న 227 మంది ప్రయాణికులతో పాటు 12మంది సిబ్బంది కూడా దుర్మరణం చెందారని భావిస్తున్నారు. ఇందులో ఎవరు కూడా బతికే అవకాశం లేదని తెలుస్తోంది. మలేషియా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఎంహెచ్ 370 విమానం కౌలాలంపూర్ నుంచి చైనా రాజధాని బీజింగ్ వెళ్తుండగా శనివారం తెల్లవారుజావున గల్లంతైంది. ఈ విమానానికి సుబాంగ్ ఏటీసీ నుండి సంబంధాలు తెగిపోయాయి. దీంతో ఇది అదృశ్యమయ్యిందనుకున్న తరుణంలో సముద్రంలో కూలిపోయిందని తెలిపారు. వియత్నాం తీరం దాటాక ఈ విమానం సిగ్నల్స్ దొరకక పోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శనివారం ఉదయం 6 గంటల సమయంలో ఈ విమానం బీజింగ్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ విమానంలో 227 మంది ప్రయాణీకులతో పాటు 12మంది సిబ్బంది కూడా ఉన్నారు. చైనాకు చెందిన 160 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన 60378841234 నంబరుతో మలేషియా ఎయిర్ లైన్స్ హెల్ప్ లైన్ నంబరును ఏర్పాటు చేసింది. తెల్లవారుజామున అదృశ్యమైన మలేషియన్ ఎయిర్లైన్స్ విమానం వియత్నాం వద్ద సముద్రంలో కుప్పకూలిందన్న సమాచారంతో బంధువులు హతాశులయ్యారు. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్తున్న ఈ విమానంలో 227 మంది ప్రయాణికులతో కలిపి మొత్తం 239 మంది ఉన్నారు. శనివారం తెల్లవారుజామున ఈ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలు తెగిపోయాయి. కౌలాలంపూర్లోని గత అర్థరాత్రి 12.41 నిమిషాలకు బయలుదేరిన విమానం బీజింగ్ ఈ రోజు ఉదయం 6.30 నిముషాలకు చేరుకోవాల్సి ఉంది. తెల్లవారుజామున 2.40 ప్రాంతంలో ఆ విమానం అదృశ్యమైంది. ఆ విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు మలేషియా ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. అదృశ్యమైన విమానంలో 150 మంది ప్రయాణికులు చైనీయులు ఉన్నారని చైనా పౌర విమానయాన మంత్రిత్వశాఖ తెలిపింది. గల్లంతైన విమానంలో భారతీయులు ఎవరూ లేరని మన విదేశాంగ శాఖ కూడా ప్రకటించింది. ఎక్కువమంది చైనీయులున్న ఈ విమానం ఇప్పుడు సముద్రంలో కూలినట్లు తెలియడంతో అందులో ఎవరూ ప్రాణాలతో బతికి బయటపడే అవకాశం కనిపించడం లేదు.