పొత్తులు లేవు, విలీనమూ లేదు
ఒంటరి పోరాటంతో ఓడిస్తాం : కేసీఆర్ ధీమా
హైదరాబాద్, మార్చి 15 (జనంసాక్షి) :
కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదూ, విలీనం ఉండదని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తేల్చి చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పోరాటమే అన్న స్పష్టత ఇచ్చారు. అలాగే ఇచ్చిపుచ్చుకునే ధోరణి కాంగ్రెస్ పార్టీకి లేదని, అందుకే ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నట్లు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని తేల్చిచెప్పారు. విలీనం సమస్యపై నెల రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నా, కానీ అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం తనతో మాట్లాడలేదని తెలిపారు. నాలుగున్నర కోట్ల ప్రజాభిప్రాయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ పార్టీ అధినేత స్పష్టం చేశారు. మంచిర్యాల మాజీ ఎమ్మేల్యే దివాకర్‌రావు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా ఇవాళ ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దిగ్విజయ్ మాటలు కాంగ్రెస్‌తో పొత్తుకు సానుకూలంగా ఉన్నాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు కాక ఉండదని పేర్కొన్నారు. రేపటినుంచి కాంగ్రెస్ పని చెబుతామన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలోకి వస్తారో, తెరాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్తారో చూద్దామన్నారు. తెలంగాణ అమరవీరుల ఆత్మహత్య లేఖల్లో కాంగ్రెస్ నేతల పేర్లే రాశారని కేసీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అమరవీరుల కుటుంబాలకు టికెట్లు ఇస్తామనడం హాస్యాస్పదమన్నారు. ఆలస్యం జరిగేకొద్ది వందలాది బిడ్డలు చనిపోతున్నారని, ఇంకెంత కాలం ఈ చావులని, తెలంగాణ ఇవ్వండని, అవసరమైతే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని ఆనాడు తాను బతిమాలినా పట్టించుకోలేదని అన్నారు. ఆనాటి మాటల ఆధారంగా ఆనాడే తెలంగాణ ఇచ్చివుంటే అప్పుడు నిర్ణయం తసీఉకునే వారమని అన్నారు. తీరా నష్టం జరిగిన తరువాత చివరాఖరున నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ అన్నారు. అదీ తాము కోరుకున్న తెలంగాణ ఇవ్వలేదని, సంపూర్ణ తెలంగాణ కోసం ఇంకా కోట్లాడాలన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, అధికారాలు, భద్రాచలం డిజన్ మళ్లింపు తదితర అంశాలపై కిరికిరి ఉండనే ఉందన్నారు. తెలంగాణ సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయమని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు చెపుతున్నట్లు విలీనం విషయంలో తాము ద్రోహం చేయలేదని చెప్పారు. పునర్నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఉద్యమంలో ఎన్నో వేదనలు, ఛీత్కారాలు భరించామని, ఎన్నో సహించామని, ఒక్కో విద్యార్థిపై వందకు పైగా కేసులు పెట్టినా ఒక్క కాంగ్రెస్ నేతైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తానే లేకపోతే ఉద్యమాన్ని చిదిమేసేవారని, మొండిగా కొట్లాడటం వల్లే ఇవాళ కల సాకారమయిందన్నారు. పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇవాళ పీసీసీ పదవి పొందిన పొన్నాల లక్ష్మయ్య విద్యార్థులను గొడ్లను కొట్టనట్లు కొట్టియలేదా?, పదవులు అనుభవిస్తూ నీళ్ళూ నిధులు సీమాంధ్రకు దోచిపెట్టింది వీళ్లు కాదా? అని ప్రశ్నించారు. అక్రమంగా ఉద్యోగాలు కొల్లగొట్టడమే కాకుండా నీళ్లు, నిధులు దోచుకున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మోసం చేశారని పొన్నాల అనడం సబబు కాదన్నారు. ఆంధ్రాకు నీళ్లు దోచిపెట్టిన పొన్నాల ఏ ముఖం పెట్టుకోని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పదిహేను వందల మంది పిల్లలను పొట్టన పెట్టుకున్న తర్వాత కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే ఉద్యమం చేశామని తెలిపారు. అమరవీరుల కుటుంబాలకు సీట్లివ్వాలని చెబుతున్న వీళ్లవల్ల కాదా విద్యార్థులు చనిపోయింది?, విద్యార్థుల సూసైడ్ నోట్లో ఎవరి పేర్లు ఉన్నాయో తెలువదా అని ప్రశ్నించారు. విలీనానికి సంబంధించి జైరాం రమేశ్ నుంచి పొన్నాల దాకా అందరూ సొల్లు పురాణం మొదలు పెట్టారని ఎద్దెవా చేశారు. తెలంగాణ ఇచ్చారని కాంగ్రెస్ పార్టీపై గౌరవంతో సహనంగా ఉన్నామని, అయినా కాంగ్రెస్ పార్టీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని, ఇక ఎంత మాత్రం సహించేది లేదని, టీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్తారో కాంగ్రెసోళ్లు టీఆర్‌ఎస్‌లోకి వస్తారో చూద్దాం అని సవాల్ విసిరారు. ఇక రేపటి నుంచి చూసుకుందామన్నారు. రాష్ట్రం తేవడంతోనే పని పూర్తికాలేదని చాలామంది తనతో అన్నారని, ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్‌లో విలీనం ప్రసక్తి లేదని తీర్మానించామని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ద్రోహం చేశాడని కొందరు అంటున్నారని, ఏం ద్రోహం చేశామని ఆయన ప్రశ్నించారు. ఎందరో బిడ్డలు ప్రాణత్యాగం చేస్తుంటే అప్పట్లో విలీనం చేస్తామన్నాం. తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల గురించి. సచివాలయంలో 80 శాతం మంది ఆంధ్రా ఉద్యోగులే ఉన్నారు. 59 వేల మంది ఉద్యోగులు ఇక్కడ ఎక్కువున్నారని ఎన్టీఆర్ హయాంలో తేల్చారు. అక్రమంగా ఉంటున్నవారిని పంపాలని ఎన్టీఆర్ హయాంలో జీవో తెచ్చారు. ఎన్టీఆర్, కాసు బ్రహ్మానందరెడ్డి ఇచ్చిన జీవోలు అమలుకాలేదు. మా బాధల గురించి జైరాం, దిగ్విజయ్‌లకు ఎన్నో చెప్పాం అయినా వినలేదు. తెలంగాణ ఉద్యమం ఉనికి లేకుండా చేసేందుకు వైఎస్ ప్రయత్నించారు. నేను లేకుంటే తెలంగాణ ఉద్యమాన్ని ఎప్పుడో వూఊదిపారేద్దురని అన్నారు. రాష్ట్రం తేవడంతోనే పని పూర్తికాలేదని చాలామంది తనతో అన్నారని, ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్‌లో విలీనం ప్రసక్తి లేదని తీర్మానించామని తెరాస అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ ఆయన కేసీఆర్ ద్రోహం చేశాడని కొందరు అంటున్నారని, ఏం ద్రోహం చేశామని ప్రశ్నించారు. ఇదిలావుంటే తెలంగాణ భవన్ ముందు మంచిర్యాల నియోజకవర్గ బీసీ నేతలు ఆందోళనకు దిగారు. బిసిలకు టిక్కెట్ ఇవ్వకుండా దివాకర్‌రావును చేర్చుకోవడంపై వారు అగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై మనరాష్ట్రం..మన సార్టీ ఇదే అందరికి కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ టీఆర్‌ఎస్ చేతిలో ఉంటేనే శ్రీరామరక్ష కేసీఆర్ అన్నారు. తెలంగాణకు టీఆర్‌ఎస్ వాచ్‌డాగ్‌లా పని చేస్తుందని పునరుద్ఘాటించారు. గత 14 ఏళ్లుగా తెలంగాణ కోసం కొట్లాడిన టిఆర్‌ఎస్ మాత్రమే ఇక్కడ అభివృద్దికి పోరాడగలదన్నారు. అంతేగాకుండా ఇంకా తెలంగాణకు దుష్టశక్తుల అడ్డు లేకుండా చేసుకోగలదన్నారు. టీఆరెస్ ప్రభుత్వంలోనే బంగారు తెలంగాణ సాధ్యమని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. ఇంటి పార్టీ, మన పార్టీని ఆదరిస్తే భవిష్యత్ తెలంగాణ అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఎన్నికల కమిటీ సమావేవంఅనంతరం ఆయన తెలంగాణ భవన్‌లో విలేకకకర్లతో మాట్లాడారు. ఎన్నికలొచ్చినయని చాలా మంది వస్తారని, ఎవరినీ నమ్మొద్దని చెప్పారు. ఆంధ్రావాళ్లతో పంచాయతీ ఇంకా తెగలేదని, రసరస ఉందన్నారు. అందుకే మనం అప్రమత్తంగా లేకపోతే మొదటికే మోసం వస్తుందన్నారు. తెలంగాణలో స్వీయ రాజకీయ శక్తిగా ఎదిగితేనే కేంద్రంతో కొట్లాడి మన రాష్టాన్న్రి అభివద్ధి చేసుకోవచ్చని, రానున్న కాలంలో ప్రాంతీయ పార్టీల సమాహారమే భారత ప్రభుత్వంగా ఏర్పడుతుందని అంతర్జాతీయ సర్వేలు సైతం వెల్లడించాయని కేసీఆర్ వివరించారు. బంగారు తెలంగాణను తయారు చేసుకునేందుకు ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతానని, తెలంగాణ తన తలరాతను తానే రాసుకోబోతోందని, కలల తెలంగాణ సాధించుకునేందుకు అందరూ సహకరించాలని, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఆర్‌ఎస్ మన ఇంటి పార్టీ.. తెలంగాణలో ఏఖోన్ముఖ శక్తిగా ఎదుగుతామని చెప్పారు. బంగారు తెలంగాణ చేయడంలో చివరి బొట్టు రక్తం వరకు పోరాడుతానని పేర్కొన్నారు. ఆంధ్రా పార్టీలు తెలంగాణలో ఉండే ఆస్కారమే లేదన్నారు. తెలంగాణ తన రాత తాను రాసుకోబోతున్నదన్నారు. కేంద్ర రాజకీయాల్లో టీఆర్‌ఎస్ చక్రం తిప్పుతుందని పేర్కొన్నారు. లోక్‌సభ, శాసనసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల తొలి జాబితాను ఒకటిరెండు రోజుల్లో ప్రకటిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. తొలి జాబితాలో 65 నుంచి 70 స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. తొలి జాబితాతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటిస్తామని తెలిపారు. అభ్యర్థుల ఎంపికల్లో అన్ని వర్గాల వారి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. బలహీన వర్గాల వారికి 51 శాతం సీట్లను కేటాయిస్తామని పేర్కొన్నారు. 16 ఎంపీ సీట్లను గెలుచుకుంటే కేంద్రంలో చక్రం తిప్పొచ్చని తెలిపారు. ఢిల్లీ నుంచి మనకు రావాల్సిన నిధులు రాబట్టుకోవచ్చని పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఢిల్లీ నుంచి అనేక పనులు చేయించుకోవాల్సి ఉందన్నారు. ఒకటి, రెండు రోజుల్లో తొలిజాబితా విడుదల చేస్తామని, రెండు, మూడు విడతల్లో అభ్యర్థుల జాబితాలు విడుదల చేస్తామని తెరాస అధినేత కేసీఆర్ తెలిపారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను నియమించాల్సి ఉందన్నారు. తెలంగాణ తెరాస చేతిలో ఉంటేనే శ్రీరామరక్ష అని, తెలంగాణలో తెరాస ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వం కావాలన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడేందుకు ఢిల్లీనుంచి అనేక పనులు చేసుకోవాలన్నారు. తెలంగాణలో 16కు 16 లోక్‌సభ సీట్లు గెలిస్తేనే కేంద్రంలో చక్రం తిప్పగలుగుతామన్నారు. భవిష్యత్తులో కేందప్రభుత్వం అంటే ప్రాంతీయ పార్టీల సమాహారం మాత్రమేనని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నచోట అవసరమైన పనులు పూర్తిచేసుకుంటున్నాయన్నారు. తెరాస శాసనసభ్యులు ఎన్నోసార్లు రాజీనామాలు చేశారని, కాంగ్రెస్ వాళ్లు జేఏసీలోకి వచ్చి రాజీనామా అనగానే పారిపోయారని కేసీఆర్ విమర్శించారు. ఓ వైపు కిరణ్ కుమార్‌రెడ్డి, టీడీపీ నేతల మాటలు చూస్తుంటే మనం ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.