-->

తెలంగాణ అమరుల త్యాగఫలమే

జూన్‌ 2నుంచి సింగరేణి 51 శాతం వాటా తెలంగాణాకే
మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక ప్యాకేజీ
తెలంగాణ అదనపు విద్యుత్‌ ఉత్పత్తి : జైరామ్‌ రమేశ్‌
మహబూబ్‌నగర్‌, మార్చి 19 (జనంసాక్షి)
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అమ రుల త్యాగఫలమేనని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఉనికిలోకి వచ్చిన తేదీ నుంచి సింగరేణిలో 51 శాతం వాటా తెలంగాణకే చెందుతుందని ఆయన తేల్చి చెప్పారు. తెలంగాణ ఏర్పాటు విషయం లో బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు అవలం బించిందంటూ జైరామ్‌ అన్నారు. రాష్ట్రం లో రెండో విడత పర్యటనకు వచ్చిన జైరామ్‌ మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లోక్‌సభలో బేషరతుగా తెలంగాణ బిల్లుకు మద్దతిచ్చిన బీజేపీ రాజ్యసభలో ద్వంద్వ వైఖరి అవలంభిం చిందని కేంద్ర తెలిపారు. తెలంగాణ బిల్లు విషయంలో బీజేపీ రెండు నాల్కల ధోరణి అవలంభించిందనిఆరోపించారు. అలాగే టీడీపీ కూడా తెలంగాణకు ముం దుగా మద్దతు ఇచ్చి ఆ తర్వాత మాట మార్చిందని ఆయన విమర్శించారు. బిజెపి రాజ్యసభలో తిరకాసు పెట్టిం దన్నారు. లోక్‌సభలో ఎలాంటి షరతులు పెట్టని బిజెపి రాజ్యసభలో అనేక షరతులు పెట్టిందన్నారు. మహబూబ్‌న గర్‌ పర్యటనలో ఉన్న ఆయన కార్యక ర్తలతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఆవిర్బా Ûవానికి ముందే కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తా మని వాగ్దానం చేసిందన్నారు. కొత్తగా టీఆర్‌ఎస్‌ వల్ల తాము తెలంగాణ ఇవ్వలే దన్నారు. తెరాస ఏర్పాటుకు ముందే కాంగ్రెస్‌ తెలంగాణ ప్రకటన చేసిందని గుర్తు చేశారు. 2000 సెప్టెబరు 21న మహబూబ్‌నగర్‌లో తెలంగాణ ప్రకటన చేసినట్లు వివరించారు. తెలంగాణకు మద్దతుగా లేఖ ఇచ్చిన తెదేపా మాట మార్చిందన్నారు. ఇచ్చిన మాట ప్రకార మే ప్రత్యేక తెలంగాణ ఇచ్చామ న్నారు. ఒక్క భాష, రెండు రాష్ట్రాల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్టాన్న్రి ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధిగా వ్యవహరించిందని అన్నారు. అటు తెలం గాణ, ఇటు సీమాంధ్రకు కాంగ్రెస్‌ న్యాయం చేసిందని తెలిపారు. అలాగే తెలంగాణలోని వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ అందుతుందని అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ¬దా కల్పించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణలో విద్యుత్‌ సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ఐదారేళ్లలో తెలంగాణలో 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కృషి చేయనున్నట్లు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఐదారేళ్లలో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి కృషి చేస్తామని ఆయన తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చారు. వెనుకబడిన జిల్లా కారణంగా మహబూబ్‌నగర్‌కు పదేళ్లు పన్నురాయితీ వస్తుందని జైరాం వివరించారు. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్ల ఆయన ప్రకటించారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు 10 ఏళ్ల పాటు పన్ను రాయితీ ఇస్తున్నట్లు వెల్లడించారు.