నో ఆప్షన్స్‌.. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే

తెలంగాణ సచివాలయంలో వాళ్లెట్లుంటరుల శ్రీఏపీ భవన్‌ మా నిజాం జాగీరే.. మాకే గావాలె
పొన్నాల జలయజ్ఞం అందరికీ ఎరుకే శ్రీపోలవరం డిజైన్‌ మార్చాల్సిందే : కేసీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 21 (జనంసాక్షి) :
తెలంగాణకు న్యాయం చేయాలని అడిగితే రెచ్చగొట్టేలా మాట్లాడినట్టా అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్‌ నాయకల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటయ్యకా కూడా ఇంకా బుద్ధి పోనిచ్చుకోవడం లేదన్నారు. శుక్రవారం ఉదయం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పోలవరంపై తాము కొత్తగా కొట్లాడం లేదని, పోలవరం డిజైన్‌ మార్చాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నామని ఆయన అన్నారు. పోలవరం ఏడు మండలాలను సీమాంధ్రలో కలపకుండా ఎందుకు అడ్డుకోవడం లేదని కాంగ్రెస్‌ నేతలను నిలదీశారు. తెలంగాణకు ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని, తమ సమస్యలపై కేంద్రం స్పందించలేదని కేసీఆర్‌ విమర్శించారు. తెలంగాణకు ఒక్క రూపా యి ఇవ్వనని కిరణ్‌ అంటే ఒక్క మంత్రయినా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన ముఠాకు సభ్యు డు పొన్నాల అని ఆరోపించారు. ఆరేళ్లుగా ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్నా దేవా దుల ప్రాజెక్టును పొన్నాల పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. పోతిరెడ్డిపాడును తాను అడ్డుకుంటే వైఎస్‌ పంచన చేరి సమర్థించింది పొన్నాల కాదా అని విమర్శించారు. పొన్నాల చరిత్ర అందరికీ తెలుసని, ఉద్యమంలో పొన్నాల ఎప్పుడైనా పాల్గొన్నారా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడు గురించి తాము మాట్లాడితే వైఎస్‌ తరపున పొన్నాల మా ట్లాడారని దుయ్యబట్టారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన దొంగల ముఠా నాయకుడు పొన్నాల లక్ష్మయ్య అని కేసీఆర్‌ అన్నారు. పొన్నాల చరి త్ర ప్రజలందరికీ తెలుసు. ఆయన ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నాడా? ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు అయితే అమెరికా లేకపోతే ఆస్పత్రికి పోయిన పొన్నాల కేసీఆర్‌ను విమర్శిస్తాడా? పొన్నాల మంత్రి పదవంతా అసమర్థుడి జీవయాత్రలా సాగింది. ఆంధ్రాలోని అక్రమ ప్రాజె క్టులకు అధికార ముద్ర వేసింది పొన్నాలనే. పొన్నాల తెలంగాణలో ఒక్క ప్రాజక్టయినా పూర్తి చేశాడా? పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపును పొన్నాల సమర్థించిండుడన్నారు. పొన్నాలకు దమ్ముంటే పోలవరంపై ఆర్డినెన్స్‌ ఆపించాలి. ఆంధ్రాలోని అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు పోనివ్వం. పోలవరంకు వ్యతిరేకం కాదు.. డిజైన్‌ మార్చాలంటున్నం. ఆంధ్రోళ్లకు పొన్నాల, డీఎస్‌ తొ త్తులు. బానిస మనస్తత్వం వదులుకోలేదని మండిపడ్డారు. తెలంగాణకు న్యా యం జరిగే వరకు కొట్లాడుతా. తెలంగాణలో 8 జిల్లాలు వెనకబడినవే ప్రత్యే క ¬దా రావాల్సిందే. ప్రపంచంలో ఏ శక్తి నన్ను ఆపలేదు.. పిట్ట బెదిరిం పులకు నేను భయపడను. తెలంగాణలో మేమే అధికారంలోకి వస్తాం. చెప్పినవన్నీ చేస్తాం. వచ్చేది జయనామ సంవత్సరం.. తెలంగాణకు జయం చేకూరుతది. సంకీర్ణ ప్రభుత్వంలో మనం కీలక శక్తిగా ఉంటేనే ఆంధ్రోళ్లతో కొట్లాడొచ్చు. పంపకాలన్నీ జూన్‌ రెండు తర్వాతే. త్వరలో తెలంగాణలో అధికారం చేపట్టబోయే పార్టీకి నేను అధ్యక్షుడినని కేసీఆర్‌ అన్నా రు.ఉద్యోగుల పంపిణీ విషయంలో దామోదర రాజనర్సింహ ఎందుకు మిడి సిపడుతున్నారని మండిపడ్డారు. విభజన తర్వాత తెలంగాణ సెక్ర టేరియట్‌లో 90 శాతం ఆంధ్రా ఉద్యోగులు ఉండటాన్ని దామోదర సమ ర్థిస్తారా అని కేసీఆర్‌ ప్రశ్నించారు. దొరల పాలన అంటే ఏమిటో రాజన ర్సింహ చెప్తారా అని నిలదీశారు. దొంగ ఎవరు? దొర ఎవరు? అని ప్రశ్నిం చిన కేసీఆర్‌ ఎవరు దొంగలో, ఎవరు దొరలో త్వరలో ప్రజలు తేల్చుతారని ఆయన వెల్లడించారు. తెలంగాణ ఎవరి జాగిరో త్వరలో తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌కు అధికారమిస్తే గొర్రెల మందకి తోడేళ్లను కాపలా పెట్టినట్టే అన్న కేసీఆర్‌ కాకి గంగలో మునిగితే హంస కాలేదని వ్యాఖ్యానించారు. వచ్చే జయనామ సంవత్సరంలో తెలంగాణ ప్రజలకు అంతా శుభసూచకమే అని కేసీఆర్‌ ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ పాలన ఎవరికి తెలియందని మల్లీ కాంగ్రెస్‌ వస్తుందని అంటున్నారని అన్నారు. గత పదేళ్లుగా వెలగబెడు తున్నదే వీల్లు కదా అని అన్నారు. విభజన అనంతరం ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దని కేసీఆర్‌ మరోసారి పునరుద్ఘాటించారు. ఎక్కడి ఉద్యోగులు అక్క డికి వెళ్లాలని అనడం తప్పెలా అవుతుందన్నారు. తనకురూల్స్‌ అన్నీ తెలు సని ఆయన మాజీ డిప్యూటీకి కౌంటర్‌ ఇచ్చారు. ఏపీ భవన్‌ను ఎట్టి పరిస్థి తుల్లో పంచొద్దని దీనిపై సుప్రీం కోర్టులో పోరాడుతామని స్పష్టం చేశారు. ఆంధ్రాలో నిర్మించబడ్డ అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు పోనివ్వమని, తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాల్సిందే
అని కేసీఆర్‌ డిమాండ్‌ చేశారు. పోలవరం డిజైన్‌ను మార్చాలనేదే తమ డిమాండ్‌ అని వీటి కోసం కడదాకా పోరాడుతామని కేసీఆర్‌ తేల్చిచెప్పారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తదని ఆపార్టీ అధినేత చంద్రబాబునాయుడు చెబుతున్నడు. ఇది జోక్‌ ఆఫ్‌ ది మిలీనియమ్‌ అని చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇంతకంటే హాస్యం మరొకటి లేదన్నారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తదని అంటున్న చంద్రబాబు వాఖ్యలపై కేసీఆర్‌ స్పందిసూ జరగనున్న ఎన్నికల ద్వారా అధికారంలోకి రాబోయేది టీఆర్‌ఎస్‌ పార్టీయే. మేం అధికారంలోకి రాగానే నీహాయాంలో జరిగిన భూకుంభకోణాలపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చంద్రబాబు అక్రమాలను కక్కిస్తాం. కోర్టులకు పోయి స్టేలు తేచ్చుకోవడాలు ఉండవని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ కోరాం అయినా కేంద్రం పట్టించుకోలేదు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్‌ నేతలు నోరు మూసుకున్నారు. ఉమ్మడి రాజధాని వద్దన్నం ఉద్యోగులకు ఆప్షన్లు ఉండొద్దన్నం. నేను తెలంగాణ గురించి మాట్లాడితే కాంగ్రెస్‌ నేతలకు నొప్పెందుకు అని ప్రశ్నించారు.